ఓన్లీ నైట్ టైమ్‌లోనే టెక్కీ చోరీలు.. లగ్జరీ లైఫ్, బీఎండబ్ల్యూ కారు, విదేశాలకు టూర్లు!
ఓ వ్యక్తి లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడ్డాడు. జాబ్ చేస్తే కుదరదనుకుని.. ఉద్యోగం కూడా వదిలేసి దొంగతనాలకు అలవాటుపడ్డాడు. లగ్జరీ లైఫ్ మెయింటెన్ చేశాడు. చివరకు పోలీసులకు దొరికాడు.
విశాఖలో ఈ మధ్యకాలంలో నైట్ టైమ్‌లో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు పదే పదే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. నిందితుడిని అరెస్ట్ చేయగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేసిన వ్యక్తే ఈ చోరీలు చేశాడని గుర్తించారు.

కాకినాడకు చెందిన మహేశ్ రెడ్డి అలియాస్ సన్నీ వైజాగ్‌లోని మాధవధార ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఐటీ రంగంలో మంచి జీవితం ఉన్నప్పటికీ విలాసాలకు అలవాటుపడ్డాడు. వైజాగ్‌కు మకాం మార్చాడు. అతడి మెయింటెనెన్స్ మామూలుగా ఉండదు. లగ్జరీ బీఎండబ్ల్యూ కారు, అనేకసార్లు విదేశాలకు వెళ్తుండేవాడు. మెుత్తానికి లగ్జరీ లైఫ్‌ను గడిపేవాడు సన్నీ.
అంతా సాఫీగా సాగిపోతుందని అనుకున్నాడు. కానీ ఇటీవలి కాలంలో పోలీసులకు పదే పదే రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నట్టుగా ఫిర్యాదులు వచ్చాయి. నెలల తరబడి దర్యాప్తు చేశారు పోలీసులు. 27 ఏళ్ల అచ్చి మహేష్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి లగ్జరీ లైఫ్ స్టైల్ చూసి పోలీసులే షాక్ అయ్యారు.
వైజాగ్, ఇతర ప్రాంతాలలో విలాసవంతమైన జీవనశైలికి నిధులు సమకూర్చుకునేందుకు వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. రాత్రుళ్లు దొంగతనాలు చేసేవాడు. అతడి అరెస్టు తర్వాత.. వైజాగ్ పోలీసులు గాజువాక, అరిలోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడతో సహా నగరంలోని వివిధ ప్రాంతాలలో 26 ఇళ్ల చోరీ కేసులను ఛేదించారు.
ఈ కేసుల్లో దాదాపు రూ.24.66 లక్షల విలువైన నగలు, నగదును దొంగిలించాడు మహేశ్ రెడ్డి. వీటిలో 1,084 గ్రాముల బంగారం, 6,300 గ్రాములకు పైగా వెండి, రూ.40,500 నగదు ఉన్నాయి.
మహేశ్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులు దాదాపు 699 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.8 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. అంతేకాదు దొంగిలించిన డబ్బుతో కొనుగోలు చేసిన లగ్జరీ బీఎండబ్ల్యూ కారు, నంబర్ లేని స్కూటర్, దొంగతనానికి ఉపయోగించే ఉపకరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకా బ్రత బాగ్చి చెప్పిన వివరాల ప్రకారం.. మహేశ్ రెడ్డి చిన్నప్పటి నుండే దొంగతనాల చేసే అలవాటు ఉంది. 15 సంవత్సరాల వయసులో పీఎంపాలెం ప్రాంతంలో ఇళ్లలోకి చొరబడి పట్టుబడ్డాడు. కొన్నిరోజులు జువైనల్ హోమ్‌కు పంపారు. విడుదలైన తర్వాత కాకినాడ, సర్పవరం, రామచంద్రపురం, ఇంద్రపాలెం, రాజమండ్రి పరిసరాల్లో దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. 14 నెలలు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా దొంగతనాల కేసుల్లో అతను పాల్గొన్నట్లు పోలీసు రికార్డులు సూచిస్తున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా ఉద్యోగం కూడా చేసేవాడు.
ఇళ్లలోకి చొరబడటానికి మహేశ్ మాస్క్‌లు, టోపీలు, చేతి తొడుగులు, సుత్తులు, స్క్రూడ్రైవర్లు, డ్రిల్లింగ్ మెషిన్ వంటి పరికరాలను ఉపయోగించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ప్రాసిక్యూషన్ కోసం ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


