నవ్విందుకు కన్నతండ్రినే చంపిన కొడుకు.. చిత్తూరు జిల్లాలో దారుణం

చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తనను చూసి నవ్వాడని మద్యం మత్తులో ఉన్న కొడుకు తండ్రిని చంపేశాడు.

Published on: Sep 3, 2026, 11:47:20 IST
By , Chittoor
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మద్యం మత్తు, క్షణికావేశం కాపురాల్లో నిప్పులు పోయడమే కాదు.. కన్నబంధాలను సైతం ఎంత దారుణంగా బలితీసుకుంటాయో నిరూపించే హృదయవిదారక ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. తనను చూసి నవ్వాడనే కారణంతో కన్నతండ్రి అని కూడా చూడకుండా గొంతు కోసి దారుణంగా హత్య చేశాడో కిరాతక కొడుకు. పెనుమూరు మండలంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘోరం జరిగింది.

చిత్తూరు క్రైమ్ న్యూస్
చిత్తూరు క్రైమ్ న్యూస్

పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మాణిక్యరాయునిపల్లె గ్రామానికి చెందిన చెంగారెడ్డి (55)కి జోకేష్ రెడ్డి, హేమచంద్ర రెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన జోకేష్ రెడ్డి ఎల్లంపల్లె సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య చూడమణి పెనుమూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తోంది. వీరిద్దరూ పెనుమూరులోనే నివాసముంటున్నారు.

అయితే జోకేష్ రెడ్డికి మద్యం వ్యసనం ఉంది. ప్రతిరోజూ తాగి వచ్చి భార్యతో గొడవపడటం, ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం అలవాటుగా మార్చుకున్నాడు. బుధవారం రాత్రి కూడా పీకలదాకా తాగి ఇంటికి వచ్చిన జోకేష్ రెడ్డి, భార్య చూడమణితో తీవ్రస్థాయిలో గొడవకు దిగాడు.

భర్త వేధింపులు తాళలేకపోయిన చూడమణి వెంటనే తన మామ అయిన చెంగారెడ్డికి ఫోన్ చేసింది. 'మీ అబ్బాయి మళ్లీ తాగి వచ్చి మమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నాడు. మీరు వెంటనే వచ్చి అతనికి బుద్ధి చెప్పి, మీతో పాటు తీసుకువెళ్లండి.' అని ఆవేదనతో చెప్పింది. ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన జోకేష్ రెడ్డి, భార్య చేతిలోని ఫోన్‌ను లాక్కున్నాడు. తన తండ్రితో మాట్లాడుతూ.. 'నేను ఇప్పుడే బైక్ వేసుకుని మాణిక్యరాయునిపల్లెకు వచ్చి నిన్ను కలుస్తాను.' అని చెప్పాడు.

చెప్పినట్లే జోకేష్ రెడ్డి బైక్‌పై మాణిక్యరాయునిపల్లెలోని తండ్రి వద్దకు చేరుకున్నాడు. అక్కడ తండ్రీకొడుకుల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తండ్రి చెంగారెడ్డి తన కొడుకు ప్రవర్తనను చూసి నవ్వాడు. మద్యం మత్తులో ఉన్న జోకేష్ రెడ్డికి, తండ్రి నవ్వడం తీవ్రమైన అవమానంగా, ఆగ్రహంగా అనిపించింది. ఆ క్షణికావేశంలో మానవత్వాన్ని మర్చిపోయిన కొడుకు పదునైన కత్తితో కన్నతండ్రి గొంతు కోసి హత్య చేశాడు. రక్తం మడుగులో తండ్రి పడిపోగానే అక్కడ నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పెనుమూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు జోకేష్ రెడ్డి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More