South Central Railway Festival Trains : రాబోయే దసరా, దీపావళి, పూజా పండుగల సమయాల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని అదుపు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని చర్లపల్లి మరియు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ఈ పండుగ సీజన్‌లో ఇరు మార్గాల్లో చెరో 8 ట్రిప్పుల చొప్పున మొత్తం 16 సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్టోబర్ 6, 2026 నుంచి నవంబర్ 25, 2026 వరకు ఈ ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి.
రైళ్ల షెడ్యూల్ - సర్వీసు తేదీలు :
- రైలు నంబర్ 07037 (చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్): ఈ రైలు ప్రతి వారం మంగళవారం రోజున చార్లపల్లి నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ నెలలో 6, 13, 20, 27 తేదీలలో, అలాగే నవంబర్ నెలలో 3, 10, 17, 24 తేదీలలో మొత్తం 8 సర్వీసులు నడుస్తాయి.
- రైలు నంబర్ 07038 (శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి ): తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి వారం బుధవారం రోజున శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ నెలలో 7, 14, 21, 28 తేదీలలో, అలాగే నవంబర్ నెలలో 4, 11, 18, 25 తేదీలలో మొత్తం 8 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి.
రెండు వైపులా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన రైల్వే జంక్షన్లలో ఆగుతాయి. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం మరియు చిపురుపల్లి స్టేషన్లలో స్టాప్‌లు కల్పించారు.
{{/usCountry}}రెండు వైపులా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన రైల్వే జంక్షన్లలో ఆగుతాయి. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం మరియు చిపురుపల్లి స్టేషన్లలో స్టాప్‌లు కల్పించారు.
{{/usCountry}}ప్రయాణికుల విభిన్న అవసరాలకు తగినట్లుగా ఈ రైళ్లలో ఏసీ II టైర్, ఏసీ III టైర్, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. పండుగ సమయంలో సాధారణ రైళ్లలో నిరీక్షణ జాబితా (వైటింగ్ లిస్ట్) ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు ముందస్తుగానే రిజర్వేషన్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ సూచించారు.