ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. తొలి దశ గ్రామ పంచాయతీ, మలి విడత పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల పోలింగ్‌ను గురువారం నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశాయి. విశాఖపట్నం, గుంటూరు జిల్లాలు మినహా మిగిలిన 26 జిల్లాల్లోని గ్రామ పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ జరగనుంది.
3,242 పంచాయతీలకు పోలింగ్..

తొలి దశలో మొత్తం 3,949 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే వీటిలో 707 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3,242 పంచాయతీలకు గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు.
ఏకగ్రీవాల నేపథ్యంలో మొదట నిర్ణయించిన 40,781 పోలింగ్ కేంద్రాల సంఖ్యను 31,614కు కుదించారు. అలాగే పోలింగ్ రూంలను 28,061 నుంచి 23,269కు తగ్గించారు. పంచాయతీ ఎన్నికలకు గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా 6,303 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసింది.
ఎస్ఈసీ కీలక ఆదేశాలు…
ఎన్నికల నిర్వహణలో కౌంటింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, నామినేషన్ల పరిశీలన, పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణ, శాంతిభద్రతలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. మొదటి, రెండు, మూడో దశ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా సరిపడా పోలీసు బలగాలను ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు.
ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను కమిషనర్ వివరిస్తూ.. నవంబర్ 26న (గురువారం) 23 పట్టణ స్థానిక సంస్థలు, 26 జిల్లాల్లోని తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయని, అదే రోజు పంచాయతీ ఫలితాలు వెలువడతాయని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు నవంబర్ 30న నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక నవంబర్ 29న రెండో దశ, డిసెంబర్ 2న మూడో దశ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి….. డిసెంబర్ 5న 23 పట్టణ స్థానిక సంస్థలకు పరోక్ష ఎన్నికలు నిర్వహించడంతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని వివరించారు.
{{/usCountry}}ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను కమిషనర్ వివరిస్తూ.. నవంబర్ 26న (గురువారం) 23 పట్టణ స్థానిక సంస్థలు, 26 జిల్లాల్లోని తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయని, అదే రోజు పంచాయతీ ఫలితాలు వెలువడతాయని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు నవంబర్ 30న నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక నవంబర్ 29న రెండో దశ, డిసెంబర్ 2న మూడో దశ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి….. డిసెంబర్ 5న 23 పట్టణ స్థానిక సంస్థలకు పరోక్ష ఎన్నికలు నిర్వహించడంతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని వివరించారు.
{{/usCountry}}కలెక్టర్లు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను సజావుగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, వాటి పంపిణీ, భద్రత విషయంలో కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు, ఎన్నికల గుర్తుల ముద్రణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తుది జాబితా ఖరారయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని కార్యదర్శి ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఎన్నికల పిటిషన్ల పరిష్కారం, న్యాయపరమైన అవసరాల దృష్ట్యా కనీసం 60 రోజుల పాటు భద్రపరచాలని స్పష్టం చేశారు. ఏదైనా ఎన్నికల పిటిషన్ దాఖలై, ఎలక్షన్ ట్రిబ్యునల్ ఆదేశిస్తే మాత్రమే ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించాలి తప్ప…. వ్యక్తులకు నేరుగా కాపీలు ఇవ్వకూడదని తేల్చిచెప్పారు.
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.