AP Panchayat Elections 2026 : ఏపీ తొలి విడత పంచాయతీ ఎన్నికలు - నేటి నుంచే నామినేషన్లు, 26న పోలింగ్
AP Grama Panchayat Elections 2026 : తొలి దశ గ్రామ పంచాయతీ పోరుకు నేటి నుంచి నామినేషన్లు షురూ కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
AP Grama Panchayat Elections 2026 : గ్రామీణ రాజకీయాల్లో కీలక ఘట్టం మొదలైంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ దశలో ఎన్నికలు జరుగుతున్న 3,967 గ్రామ పంచాయతీలకు ఇవా(నవంబర్ 15) ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా 1,295 కేంద్రాలను యంత్రాంగం సిద్ధం చేసింది.

జనాభా ప్రాతిపదికన కేంద్రాల ఏర్పాటు పంచాయతీల జనాభాను బట్టి అధికారులు నామినేషన్ కేంద్రాలను విభజించారు. పది వేలకు పైగా జనాభా ఉన్న పెద్ద గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా ఒక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతకంటే తక్కువ జనాభా కలిగిన చిన్న పంచాయతీల విషయంలో మాత్రం, మూడు లేదా నాలుగు పంచాయతీలను కలిపి ఒకే క్లస్టర్‌గా చేసి ఒక నామినేషన్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.
నవంబర్ 26న పోలింగ్…
తొలి దశ ఎన్నికల్లో భాగంగా 3,967 సర్పంచ్ స్థానాలతో పాటు 40,012 వార్డు సభ్యుల పదవులకు పోటీ జరగనుంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. దాఖలైన పత్రాలను నవంబర్ 18న అధికారులు పరిశీలిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యర్థులు నవంబర్ 19, 20 తేదీల్లో అప్పీలు చేసుకోవచ్చు.
పోటీ నుంచి తప్పుకోవాలనుకునే వారికి నవంబర్ 21 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓటింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి… అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 27న నిర్వహిస్తారు.
మరోవైపు నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా పక్కాగా ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో ఉంది.
ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా నవంబర్ 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 24న ఉపసంహరణ గడువు ముగియనుండగా, నవంబర్ 29న పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
మూడో విడత నవంబర్ 19న నోటిఫికేషన్ వెలువడనుండగా… నవంబర్ 23 నామినేషన్లకు చివరి తేదీ. నవంబర్ 27న ఉపసంహరణ అనంతరం, డిసెంబర్ 2న తుది విడత పోలింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

