తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 17 వరకు నామినేషన్లు

Grama Panchayat Elections : ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. నవంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

Published on: Nov 13, 2026, 12:18:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో రాజకీయం హీటెక్కింది. రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు (AP Panchayat Elections 2026) రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

మెుదటి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
మెుదటి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో మొదటి దశ ఎన్నికలు జరిగే గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు నవంబర్ 17 సాయంత్రం 5:00 గంటల వరకు ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ నవంబర్ 21గా నిర్ణయించారు. నవంబర్ 26వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 26న పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 27న నిర్వహిస్తారు.

రాష్ట్రంలోని 13,313 గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత నవంబర్ 26న పోలింగ్, ఫలితాలు ఉంటాయి. రెండో విడత నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా నవంబర్ 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 24న ఉపసంహరణ గడువు ముగియనుండగా, నవంబర్ 29న పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

మూడో విడత నవంబర్ 19న నోటిఫికేషన్ వెలువడనుండగా, నవంబర్ 23 నామినేషన్లకు చివరి తేదీ, నవంబర్ 27న ఉపసంహరణ అనంతరం, డిసెంబర్ 2న తుది విడత పోలింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది.

మున్సిపల్ ఎన్నికలు

మరోవైపు సాంకేతిక, న్యాయపరమైన కారణాలతో గతంలో నిలిచిపోయిన 23 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రాజకీయం వేడెక్కింది. నవంబర్ 26న పోలింగ్ ఉంటుంది. 30వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. అనంతరం డిసెంబర్ 3న ఆయా సంస్థలకు మేయర్, ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ల ఎంపిక కోసం పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు.

శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం (రాజమండ్రి), మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నర్సరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి.కొత్తకోటలో ఎన్నికలు నిర్వహిస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More