Andhrapradesh : ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణా శాఖ ఉక్కుపాదం - ఐదు బస్సులు సీజ్
ఏపీలో ప్రైవేట్ బస్సుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఐదు అంతరాష్ట్ర బస్సులను సీజ్ చేశారు.
ఏపీలో బస్సు ప్రమాదాల తర్వాత… విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల విషయంలో అధికారులు కఠినంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలను ఉల్లంఘించిన ఐదు అంతర్రాష్ట్ర ప్రైవేట్ బస్సులను రవాణా శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు.

విస్తృతంగా తనిఖీలు…
హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు నడిచే ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ బస్సుల భద్రతా ఉల్లంఘనలను అరికట్టడం లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బస్సుల్లో అక్రమంగా అదనపు డీజిల్ ట్యాంకులను ఏర్పాటు చేయడంతో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ (అత్యవసర ద్వారాల) వద్ద లగేజీని ఉంచి దారిని మూసివేయడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నారు.
కొన్ని బస్సుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన అత్యవసర ద్వారాలు(వెనక భాగం) లేకపోవడం. ఎస్కేప్ హాచ్‌లు (పైకప్పు ద్వారాలు) సరిగ్గా పనిచేయకపోవడం వంటి లోపాలు బయటపడుతున్నాయి. ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఐదు స్లీపర్ కోచ్ బస్సులను సీజ్ చేశారు.
నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను నిర్వాహకులకు రూ. 2.1 లక్షల పైగా జరిమానా విధించారు. సీజ్ చేసిన బస్సులను రాజమహేంద్రవరంలోని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) కార్యాలయంలో ఉంచారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని…. నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

