...
...
Next Story

మెుంథా తుపాను.. విమాన సర్వీసులు రద్దు.. దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు!

మెుంథా తుపాను ప్రభావం మెుదలైంది. దీంతో పలు విమాన సర్వీసులు, రైళ్లను రద్దు చేశారు. విజయవాడకు మంగళవారం భారీ వర్ష సూచన ఉంది.

Published on: Oct 27, 2025, 22:00:51 IST
Advertisement

మెుంథా ఎఫెక్ట్ చూపిస్తుంది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ ప్రభావం పెరుగుతూనే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గడిచిన ఆరు గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో కదిలింది తుపాను. మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. మంగళవారం రాత్రికి తీరం దాటనుంది. ఈ సమయంలో గంటలకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

మెుంథా తుపాను
మెుంథా తుపాను

మెుంథా తుపాను ప్రభావం నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం అవుతూనే ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లోని ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు.

విమాన సర్వీసులు రద్దు

ఇక తుపాను ఎఫెక్ట్ రాకపోకలపై తీవ్రంగా కనిపిస్తుంది. తీరం దిశగా మెుంథా తుపాను చురుగ్గా కదులుతోంది. ఇప్పటికే 100కు పైగా రైళ్లను రద్దు చేశారు. తాజాగా పలు విమానాలను కూడా రద్దు చేశారు. దిల్లీ వెళ్లే విమానాలు మినహా మిగిలిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులను రద్దు చేశారు. విశాఖ నుంచి వెళ్లే ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి.

ఐఎక్స్ 28919 విశాఖపట్నం-విజయవాడ, ఐఎక్స్ 2862 విజయవాడ-హైదరాబాద్, ఐఎక్స్ 2875 విజయవాడ-బెంగళూరు, ఐఎక్స్ 976 షార్జా-విజయవాడ, ఐఎక్స్ 975 విజయవాడ-షార్జా, ఐఎక్స్ 2743 హైదరాబాద్ విజయవాడ, ఐఎక్స్ 2743 విజయవాడ-విశాఖపట్నం సర్వీసులు రద్దయ్యాయి.

దక్షిణ మధ్య రైల్వే సూచనలు

ఇప్పటికే ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రజలకు సూచలను చేసింది. అత్యవసరం అయితేనే రైళ్లలో ప్రయాణం చేయాలని పేర్కొంది. విజయవాడలో కంట్రోల్ రూమ్ ద్వారా రైళ్ల రాకపోకలు, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టుగా తెలిపింది. ప్రయాణికుల రైళ్ల స్టేటస్ తెలుసుకుని బయలుదేరాలని చెప్పింది.

మంగళవారం తుపాను ప్రభావంతో విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 16 సెం.మీపైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో 9154970454, వీఎంసీ కార్యాలయంలో 08662424172, 08662422515, 08662427485 నెంబర్లు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe