నంద్యాలలో ఫుడ్ పాయిజనింగ్.. మిగిలిన పెళ్లి భోజనం తిని 60 మందికిపైగా ఆసుపత్రికి!

Nandyal Food Poisoning : నంద్యాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మిగిలిన పెళ్లి భోజనం తిని 60 మందికిపైగా ఆసుపత్రిపాలయ్యారు. వారికి చికిత్స జరుగుతోంది.

Published on: Mar 24, 2026, 17:43:54 IST
By , Nandyala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మిగిలిపోయిన పెళ్లి భోజనం తినడంతో 10 మంది చిన్నారులతో సహా 60 మందికి పైగా ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు. నంద్యాలలోని వైఎస్ఆర్ నగర్‌లోని బుడగ జంగల కాలనీలో కొందరు వచ్చి.. మిగిలిపోయిన పెళ్లి భోజనం పంచారు.

నంద్యాలలో ఫుడ్ పాయిజనింగ్
నంద్యాలలో ఫుడ్ పాయిజనింగ్

వివాహ వేడుకలో మిగిలిపోయిన ఆహారాన్ని స్థానికులు తినడంతో వారికి వాంతులు, విరోచనాలు, జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో వైఎస్ఆర్ నగర్‌కు చెందినవారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో చాలా మంది పరిస్థితి నిలకడగా ఉండగా, ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే.. మున్సిపల్ కమిషనర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని అంచనా వేయడానికి ఆసుపత్రిని సందర్శించారు. రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ ఘటనపై ఆరా తీశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్య అధికారుల నుంచి సమాచారం కోరారు.

మిగిలిపోయిన పెళ్లి భోజనం తిని.. ప్రభావితమైన వారందరికీ ఉత్తమ వైద్యం అందించాలని మంత్రి జనార్దన్ ఆదేశించారు. కొందరు ప్రవైట్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. మరికొందరికి ఇంటి వద్దే వైద్యం కూడా చేస్తున్నారు అధికారులు.

ఫుడ్ పాయిజన్‌కు కారణంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మిగిలిపోయిన పెళ్లి భోజనం తినడం కారణంగా అస్వస్థతకు గురైనట్టుగా ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ ఘటనపై స్థానిక మహిళ మాట్లాడారు. పెళ్లి భోజనాలు మిగిలాయని ఆటోలో తీసుకొచ్చారని తెలిపారు. సోమవారం రాత్రి 11 గంటల తర్వాత వారిలో కొంతమంది కడుపునొప్పితో బాధపడుతూ, వాంతులు చేసుకున్నారు. మంగళవారం కూడా కొందరికి ఇలాగే జరిగింది. ఇంట్లోనే తగ్గుతుందని కొందరు పెద్దగా పట్టించులేదు. తర్వాత పరిస్థితి విషమించి.. ఇబ్బంది ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రులకు పరుగులు పెట్టారని మహిళ వెళ్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More