ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిత్తల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరిగింది. కేంద్ర మంత్రులతో కలిసి, ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు భూమి పూజ జరిగింది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటు కానుంది. లక్ష మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.

గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రెండు దశల్లో సాకారం కానుందని ప్రభుత్వం చెబుతోంది. అనుబంధంగా రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ వస్తుంది. దీంతో మరో 6 వేల ఉద్యోగాలు రానున్నాయి. ఏఎంఎన్ఎస్ ఇండియా రాకతో పరిశ్రమల హబ్‌గా విశాఖ ఎకనమిక్ రీజియన్ మారనుంది.
జాతీయ, అంతర్జాతీయ ఉక్కు మార్కెట్‌లో ఏఎంఎన్ఎస్ ఇండియా భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించనుంది. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది. స్టీల్ ప్లాంట్‌ను ఎన్‌హెచ్-16తో కలిపేలా శరవేగంగా 4 లేన్ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి.
మొదటి దశలో 2600 ఎకరాల్లో రూ.80 వేల కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు వేశారు.
ఆర్సెలార్ మిట్టల్- నిప్పాన్ స్టీల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆ సంస్థ ఇండియా చైర్మన్ ఆదిత్య మిత్తల్ మాట్లాడారు. ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం స్పష్టంగా కనిపించిందన్నారు. స్పష్టమైన విధానాలు ఉంటే ఎంత వేగంగా పనులు సాకారం అవుతాయో ఏపీ నిరూపించిందని ప్రశంసించారు.
'పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులకు ఏపీపై ఉన్న నమ్మకానికి ఈ పరిశ్రమ అతిపెద్ద ఉదాహరణ. ఈ పరిశ్రమ ద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి, రైతులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. విశాఖలోని ప్లాంట్ నుంచి ముడి ఇనుము ఖనిజ సరఫరా పైప్ లైన్ అనకాపల్లి వరకూ విస్తరిస్తాం. ఇక్కడ తయారైన ఉక్కు ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తాం. దేశీయ అవసరాలకు సరఫరా చేస్తాం. జాతీయ ఉక్కు విధానంలో భాగంగా జాతీయ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ ప్లాంట్ కీలకమవుతుంది.' అని ఆదిత్య మిత్తల్ అన్నారు.
{{/usCountry}}'పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులకు ఏపీపై ఉన్న నమ్మకానికి ఈ పరిశ్రమ అతిపెద్ద ఉదాహరణ. ఈ పరిశ్రమ ద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి, రైతులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. విశాఖలోని ప్లాంట్ నుంచి ముడి ఇనుము ఖనిజ సరఫరా పైప్ లైన్ అనకాపల్లి వరకూ విస్తరిస్తాం. ఇక్కడ తయారైన ఉక్కు ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తాం. దేశీయ అవసరాలకు సరఫరా చేస్తాం. జాతీయ ఉక్కు విధానంలో భాగంగా జాతీయ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ ప్లాంట్ కీలకమవుతుంది.' అని ఆదిత్య మిత్తల్ అన్నారు.
{{/usCountry}}ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన మాత్రమే కాదు. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం, నమ్మకానికి ఇదొక ఉదాహరణ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. 2019 కంటే ముందు ఆదిత్య మిత్తల్‌ను కలిసి ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరినట్టుగా చెప్పారు. 2024లో ఏపీలో మళ్లీ కూటమికి పట్టం కట్టారని, అప్పటి నుంచే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ మొదలైందన్నారు.
కేవలం 30 నిముషాల జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమ ఏపీకి వచ్చిందని లోకేశ్ చెప్పారు. 'రాష్ట్రంలో 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. చాలా మంది ప్రజల్ని కలిశాను. వారి ఆకాంక్షల్ని తెలుసుకున్నాను. అందుకే రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పించుకున్నాం. ఆ హామీని నెరవేర్చటంలో భాగంగా ఇవాల్టి శంకుస్థాపన మరో మైలు రాయి అవుతుంది. ఇప్పటికే పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలకు పోటీగా మేం వెళ్లటం లేదు. కానీ ఏపీకి కూడా పరిశ్రమల్ని ఆకర్షించగల సత్తా ఉందని నిరూపిస్తున్నాం. ప్రపంచ స్టీల్ పటంలో అనకాపల్లికి కూడా స్థానం దక్కింది. ఈ ప్రాజెక్టు సాకారం కావటంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అనుసరించాం.' అని లోకేశ్ చెప్పుకొచ్చారు.