...
...
Next Story

అడవిలో నుంచి వణుకుతూ వచ్చిన పిల్లాడు.. అడిగితే అసలు విషయం బయటకి!

అన్నమయ్య జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పిల్లాడు అడవిలో నుంచి భయపడుతూ వస్తున్నాడు. అతడిని ప్రశ్నించగా ఘోరమైన ఘటన బయటకు వచ్చింది.

Published on: Apr 07, 2026 10:42 AM IST
Advertisement

అన్నమయ్య జిల్లాలోని బోయకొండ కొండ సమీపంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలుడు అడవిలో నుంచి వణుకుతూ బయటకు వచ్చాడు. అతడి భయం చూసి అడగ్గా.. దారుణమైన విషయాన్ని బయటపెట్టాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. బాలుడు ధైర్యంగా తప్పించుకోవడంతో తండ్రి హత్య వెలుగులోకి వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పోలీసుల కథనం ప్రకారం, తమిళనాడుకు చెందిన గాంధీ, అతని భార్య.. చౌడేపల్లె మండలం, ఆర్ఆర్ కాలనీలోని ఒక కోళ్ల ఫారంలో పని చేసేవారు. గాంధీ భార్యతో నరసింహులు అనే వ్యక్తికి వివాహేతర సంబందం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయం గాంధీకి కూడా తెలుసని చెబుతున్నారు. వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు.

కానీ ఆదివారం రాత్రి (ఏప్రిల్ 5, 2026) కొండ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో నరసింహులు మద్యం పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి గాంధీని కూడా పిలిచాడు. అయితే నరసింహులు ముందుగానే పథకం వేసుకున్నాడు. ఈ విషయం అర్థంకాని గాంధీ నాలుగేళ్ల కుమారుడిని కూడా పార్టీకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మద్యం సేవించారు. మరోవైపు పిల్లాడు వీరిని గమనిస్తూ ఉన్నాడు.

పార్టీ జరుగుతున్న సమయంలో గాంధీ, నరసింహులుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో నరసింహులు ఒక బండరాయితో గాంధీ తలపై కొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పిల్లాడు భయపడ్డాడు.

ఈ దాడితో వణుకుతూ.. ఆ బాలుడు అడవిలోకి పారిపోయి రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఒక అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు ఆ బాలుడు అడవిలోంచి బయటకు వస్తుండగా గమనించారు. బాలుడు భయంగా నడుస్తూ వచ్చే విధానం చూసి అనుమానం వచ్చింది. వెళ్లి ప్రశ్నించగా.. హత్య గురించి వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పుంగనూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe