Vizag Zoo Free Entry : విశాఖ జూపార్క్‌లో నవంబర్ 14న పిల్లలకు ఫ్రీ ఎంట్రీ

Vizag Zoo Free Entry : విశాఖ జూపార్క్‌లో బాలల దినోత్సవ సందర్భంగా ఫ్రీ ఎంట్రీ ఇస్తారు. నవంబర్ 14న 12 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు చిన్నారులకు ఉచితంగా ప్రవేశం ఉంది.

Published on: Nov 13, 2026, 09:26:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బాలల దినోత్సవం(Children's Day) పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల చిన్నారులకు ప్రత్యేక కానుకను ప్రకటించింది. నవంబర్ 14వ తేదీన 12 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జూపార్క్‌లోకి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు జూ క్యూరేటర్ జి. మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.

వైజాగ్ జూ పార్క్
వైజాగ్ జూ పార్క్

ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశాలు చూసుకుంటే.. పిల్లలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా వన్యప్రాణులను వీక్షించే అవకాశం కల్పించడం. వివిధ రకాల జంతువుల జాతులు, వాటి సహజ ఆవాసాలు, ప్రవర్తన, పర్యావరణ సమతుల్యతలో వాటి ప్రాముఖ్యతను చిన్నారులకు తెలియజేస్తారు. చిన్న వయస్సు నుంచే పిల్లల్లో వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణపై బాధ్యతాయుతమైన అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఉచిత ప్రవేశ సదుపాయం కేవలం నవంబర్ 14వ తేదీ (శనివారం) ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 12 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు మాత్రమే టికెట్ మినహాయింపు వర్తిస్తుంది. జూపార్క్‌లోకి వచ్చే సందర్శకులు ప్లాస్టిక్ వస్తువులను తీసుకురాకూడదని, జంతువులకు ఆహారం వేయడం లేదా వాటిని ఇబ్బంది పెట్టడం వంటివి చేయకుండా జూ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.

తూర్పు కనుమల సహజ సిద్ధమైన అటవీ ప్రాంతం మధ్యలో విస్తరించి ఉన్న విశాఖ జూపార్క్ పర్యాటకులను, ముఖ్యంగా పిల్లలను ఎంతో ఆకట్టుకుంటుంది. బాలల దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలను జూపార్క్‌కు తీసుకువచ్చి, వారికి విజ్ఞానంతో కూడిన వినోదాన్ని అందించాలని జూ క్యూరేటర్ జి. మంగమ్మ కోరారు.

'విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న 12 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తుంది. వన్యప్రాణులను అన్వేషించడానికి, వివిధ జంతు జాతులను గమనించడానికి, వాటి సహజ ఆవాసాలు, ప్రవర్తన, పర్యావరణ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి పిల్లలకు అవకాశం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఉచిత ప్రవేశ ఆఫర్ నవంబర్ 14న మాత్రమే చెల్లుబాటు అవుతుంది.' అని జూ క్యూరేటర్ జి. మంగమ్మ ప్రకటించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More