...
...
Next Story

Gas Cylinder Price : జనాలకు గ్యాస్ సిలిండర్ ధరల సెగ.. బ్లాక్ మార్కెట్‌లో చుక్కలు చూపిస్తున్న రేట్లు!

Gas Cylinder Price : దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చూపిస్తూ.. పలువురు బ్లాక్ మార్కెట్‌లో దారుణంగా దోపిడీ చేస్తున్నారు.

Published on: Mar 10, 2026, 16:41:13 IST
Advertisement

ఇటీవల దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెరిగింది. ఏపీలోని అనేక జిల్లాల్లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లను పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హోటళ్లు అధిక ధరలకు సిలిండర్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. యుద్ధ సంబంధిత సమస్యలను దృష్టిలో ఉంచుకుని దేశీయ ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన తర్వాత ఈ పరిస్థితి తలెత్తింది. పశ్చిమాసియా యుద్ధ భయాలను చూపిస్తూ పలువురు సొమ్ము చేసుకుంటున్నారు.

గ్యాస్ సిలిండర్ ధరలు
గ్యాస్ సిలిండర్ ధరలు

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని.. కొంతమంది ఎల్పీజీ పంపిణీదారులు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ అనధికారిక మార్గాల ద్వారా సిలిండర్లను అమ్మేస్తున్నారు. వారం క్రితం వరకు దాదాపు రూ.2,200కి లభించే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు బ్లాక్ మార్కెట్‌లో రూ.3,200 వరకు అమ్ముడవుతోంది.

మొదట్లో స్టాక్ అయిపోయిందని డిస్ట్రిబ్యూటర్లు చెప్పుకొచ్చారట. అయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, అధిక ధరలకు సిలిండర్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. కొన్ని సందర్భాల్లో గృహ వినియోగం కోసం ఉద్దేశించిన ఎల్పీజీ సిలిండర్లను చట్టవిరుద్ధంగా వాణిజ్య సిలిండర్లలో నింపి హోటళ్లకు విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో ధరలను పెంచడానికి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ఇప్పటికే వేలాది సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌లోకి ప్రవేశించాయని సమాచారం.

గృహ ఎల్పీజీ ధరలను కూడా పెంచేసి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. బ్లాక్‌లో సిలెండర్‌కు రూ.1500 దాటిపోతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ వార్ గ్యాస్ ధరలపై ప్రభావం చూపిస్తుందనే భయం మెుదలైంది. ప్రభుత్వం ఇటీవల ఎల్బీజీ సిలిండర్ల ధరలను పెంచింది. రీఆర్డరింగ్ నిబంధనలను కూడా కఠినం చేసింది. భారతదేశం ఎల్పీజీ డిమాండ్‌లో ఎక్కువ శాతం దిగుమతుల ద్వారా తీరుస్తుంది. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ వంటి గల్ఫ్ దేశాల నుండి ఎల్బీజీ వస్తుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe