Petrol price today : గ్యాస్ సిలిండర్ రేట్లు జంప్- మరి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయా?
today petrol price : దేశంలో డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మరి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయా? తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లను ఇక్కడ తెలుసుకోండి..
శనివారం, మార్చ్ 7న భారతీయులకు పొద్దున్నపొద్దునే గట్టి షాక్ ఎదురైంది! ఇళ్లల్లో వినియోగించే గ్యాస్ సిలిండర్లతో పాటు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా, ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల నెపథ్యంలో సామాన్యుడిపై 'బాదుడు' మొదలైందని ప్రజల్లో ఆందోళనలు పెరుగుతోంది. సిలిండర్ రేటు పెంపు తర్వాత ఇప్పుడు అందరి భయం.. పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న అనిశ్చి నేపథ్యంలో, చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? ఈ వార్త ఏ క్షణంలోనైనా వినాల్సి వస్తుందా? అని అందరు ఆవేదన చెందుతున్నారు.

మరి ఈరోజు, మార్చ్ 7న దేశంలో ఇంధన ధరలు పెరిగాయా?
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయా?
లేదు. మార్చ్ 7న పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. అంతర్జాతీయంగా అనిశ్చితి కొనసాగుతున్నప్పుటికీ దేశంలో ఇంధన ధరలు ఇంకా పెరగలేదు.
హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత?
హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 107.5గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ. 95.70గా ఉంది. గత కొన్ని నెలల పాటు ధరలు ఇలాగే ఉన్నాయి.
ఇక విజయవాడలో లీటరు పెట్రోల్ ధర ప్రస్తుతం రూ. 109.74గాను, లీటరు డీజిల్ ధర రూ. 97.57గాను ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి?
వరంగల్ : పెట్రోల్- రూ. 107.05, డీజిల్- రూ. 95.61
సూర్యాపేట్ : పెట్రోల్- రూ. 107.39, డీజిల్- రూ. 95.61
సిద్ధిపేట్ : పెట్రోల్- రూ. 107.29, డీజిల్- రూ. 95.53
నిజామాబాద్ : పెట్రోల్- రూ. 10.83, డీజిల్- రూ. 97.10
నల్గొండ : పెట్రోల్- రూ. 107.38, డీజిల్- రూ. 95.60
ఖమ్మం : పెట్రోల్- 107.49, డీజిల్- రూ. 95.71
భద్రాద్రి కొత్తగూడెం : పెట్రోల్- రూ. 108.37, డీజిల్- రూ. 96.55
అనంతరపూర్ : పెట్రోల్- రూ. 108.76, డీజిల్- రూ. 96.66
చిత్తూరు : పెట్రోల్- రూ. 110.35, డీజిల్- రూ. 98.19
కడప : పెట్రోల్- రూ. 108.82, డీజిల్- రూ. 96.70
రాజమండ్రి : పెట్రోల్- రూ. 109.72, డీజిల్- రూ. 97.54
కర్నూల్ : పెట్రోల్- రూ. 108.97, డీజిల్- రూ. 96.86
విశాఖపట్నం : పెట్రోల్- రూ. 108.35, డీజిల్- రూ. 96.22
దేశంలోని ఇతర మెట్రో ప్రాంతాల్లో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి?
ముంబై : పెట్రోల్- రూ. 103.50, డీజిల్- రూ. 90.03
చెన్నై : పెట్రోల్- రూ. 101.60, డీజిల్- రూ. 92.61
బెంగళూరు : పెట్రోల్- రూ. 102. 96 , డీజిల్- రూ. 90.99
కోల్‌కతా : పెట్రోల్- రూ. 105.41, డీజిల్- రూ. 92.02
పెట్రోల్, డీజిల్ ధరలు- నెక్ట్స్ ఏంటి?
ఏదో ఒక కారణంగా అంతర్జాతీయంగా ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ, గత కొన్నేళ్లుగా దేసంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్ద మార్పులు కనిపించలేదు.
కానీ ఇప్పుడు విషయం ఇరాన్‌తో! ప్రపంచ చమురు సరఫరాకు జీవనాధారంగా భావించే హర్ముజ్ జలసంధిని కంట్రోల్ చేసే ఇరాన్ ఎప్పుడు ఏం చేస్తుందోననే భయం ఉంది. అందుకే ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, దేశంలో రానున్న కొన్ని నెలల్లో కేరళ తమిళనాడు నుంచి పశ్చిమ్ బెంగాల్ వరకు అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం అంటే రిస్కీ అని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భావించవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












