తిరుమలకు వచ్చే భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తమ సూచనలు ఇవ్వాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను తొలిసారిగా సందర్శించిన ఈవో సేవకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం సేవకులతో సమావేశమై అన్నప్రసాదం, పరిశుభ్రత, క్యూలైన్ నిర్వహణ తదితర అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

భక్తులకు ప్రత్యక్షంగా సేవలందించే సేవకులు వారి సమస్యలను బాగా అర్థం చేసుకోగలరని, అందువల్ల అందించే సూచనలు ఎంతో విలువైనవని ఈవో పేర్కొన్నారు. సేవకులు అందించే ఫీడ్‌బ్యాక్ భక్తుల సౌకర్యాల అభివృద్ధికి, వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి కీలకంగా ఉపయోగపడుతుందని ఈవో తెలిపారు.
అంతకముందు ఈవో సేవా సదన్-2లోని రిసెప్షన్, వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ కౌంటర్లను సందర్శించి, సేవకులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అలాగే హాల్స్‌ను తనిఖీ చేశారు. అనంతరం కొంతమంది సేవకులతో మాట్లాడగా వారికి అందుతున్న సౌకర్యాలపై సేవకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవి చంద్ర, పులువురు బోర్డు సభ్యులు, జేఈవో (విద్య&వైద్యం) డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.
భక్తులను విశేషంగా ఆకట్టుకున్న పుష్పాలంకరణలు
{{/usCountry}}ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవి చంద్ర, పులువురు బోర్డు సభ్యులు, జేఈవో (విద్య&వైద్యం) డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.
భక్తులను విశేషంగా ఆకట్టుకున్న పుష్పాలంకరణలు
{{/usCountry}}ఉగాది సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం శ్రీవారి ఆలయ పరిసరాలు, మహాద్వారం, ఆలయం ముందు ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనలు జీఎన్‌సీ టోల్ గేట్ ప్రాంతాల్లో చేసిన పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.