Godavari Flood Update : గత కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది భద్రాచలం వద్ద క్రమంగా శాంతిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది.
ప్రస్తుత నీటిమట్టాల వివరాలు…

భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 47.9 అడుగులకు చేరింది. ప్రవాహం తగ్గడంతో అధికారులు ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఇక కూనవరం వద్ద నీటిమట్టం 21.50 మీటర్లుగా నమోదు కాగా, పోలవరం వద్ద 13.39 మీటర్ల వద్ద ప్రవాహం కొనసాగుతోంది.
ధవళేశ్వరం వద్ద తగ్గని ఉధృతి…
ఎగువన ప్రవాహం తగ్గుతున్నప్పటికీ, దిగువన ఉన్న ధవళేశ్వరం బ్యారేజి వద్ద మాత్రం వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.69 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. దీంతో అధికారులు ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇంకా వరద ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు చేపడుతున్న సహాయక చర్యలకు స్థానిక ప్రజలు, బాధితులు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
వరద ఉధృతి దృష్ట్యా లోతట్టు, పరివాహక ప్రాంత ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే వాగులు, వంకలు, కాలువలను దాటే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని స్పష్టం చేస్తున్నారు.
ఏపీకి వర్ష సూచన :
ఇదిలా ఉండగా…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది. ఇవాళ (02-08-2026) విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు (పోలవరం), ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రవాహాలు ఉన్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను హెచ్చరించింది.
{{/usCountry}}ఇదిలా ఉండగా…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది. ఇవాళ (02-08-2026) విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు (పోలవరం), ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రవాహాలు ఉన్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను హెచ్చరించింది.
{{/usCountry}}