అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాల తరగతి గదిలో రంపంతో భయంకరమైన దాడికి గురై తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక క్రమంగా కోలుకుంటోందని…. ఆమె ఆరోగ్యంలో స్థిరమైన పురోగతి కనిపించిందని వైద్యుల బృందం స్పష్టం చేసింది.

ఇందుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక పూర్తిగా స్పృహలోకి వచ్చిందని, ఆమె తల్లిని కూడా కలవడానికి ఆస్పత్రి వర్గాలు అనుమతించినట్లు పేర్కొన్నారు. బాలిక స్వయంగా ఊపిరి తీసుకోగలిగేలా ఆరోగ్యం మెరుగుపడటంతో…. సోమవారం సాయంత్రానికి వెంటిలేటర్ సపోర్ట్‌ను తొలగించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. బాలిక త్వరగా పూర్తి కోలుకోవాలని యావత్ రాష్ట్ర ప్రజలు, కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు.
బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి వైఎస్ జగన్ పర్యటన
ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం బెంగళూరుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు మణిపాల్ ఆసుపత్రికి చేరుకోనున్న జగన్…. ఆసుపత్రి వైద్యులను కలసి గోపికకు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పి, ఓదార్చనున్నారు.
రాప్తాడు పాఠశాలలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై అనంతపురం జిల్లా పోలీసులు వేగంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఆదివారం అనంతపురం జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంత శివార్లలో నిందితుడిని పోలీసులు చుట్టుముట్టారని ఎస్పీ జగదీష్ తెలిపారు.
ఆ సమయంలో నిందితుడు కత్తితో పోలీసులపై దాడికి దిగి ఒక ఇన్ స్పెక్టర్‌ను గాయపరచడంతో, పోలీసులు ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపారు. నిందితుడి మోకాలి కింద భాగంలో దాదాపు ఆరు రౌండ్ల కాల్పులు జరగ్గా, తీవ్రంగా గాయపడిన నిందితుడిని పోలీసులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని, విచారణకు సహకరించే పరిస్థితి వచ్చాక పూర్తిస్థాయిలో ప్రశ్నిస్తామని ఎస్పీ తెలిపారు.
{{/usCountry}}ఆ సమయంలో నిందితుడు కత్తితో పోలీసులపై దాడికి దిగి ఒక ఇన్ స్పెక్టర్‌ను గాయపరచడంతో, పోలీసులు ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపారు. నిందితుడి మోకాలి కింద భాగంలో దాదాపు ఆరు రౌండ్ల కాల్పులు జరగ్గా, తీవ్రంగా గాయపడిన నిందితుడిని పోలీసులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని, విచారణకు సహకరించే పరిస్థితి వచ్చాక పూర్తిస్థాయిలో ప్రశ్నిస్తామని ఎస్పీ తెలిపారు.
{{/usCountry}}పాఠశాల గదిలోనే జరిగిన ఈ దాడితో తీవ్ర భయాందోళనలకు గురైన విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ‘ట్రామా-రెస్పాన్స్’ కార్యక్రమాన్ని ప్రకటించారు. 20 మంది మానసిక నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, రాప్తాడు పాఠశాలలోని పదో తరగతి 'ఎ' విభాగానికి చెందిన 32 మంది విద్యార్థులతో పాటు 8, 9, 10 తరగతుల బాలికల ఇళ్లకు నేరుగా పంపిస్తున్నారు. కౌన్సెలర్లు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు భావోద్వేగ మద్దతు అందిస్తూ భయం నుంచి బయటపడేలా కృషి చేస్తున్నారు.