ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 4, 5 తేదీల్లో స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే మున్సిపల్ పోలింగ్ అయిపోయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటించింది.
పరిషత్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 4, 5వ తేదీల్లో సెలవు ప్రకటించింది. నవంబర్ 5న పోలింగ్, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనున్న MPTC, ZPTC ఎన్నికల సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

నవంబర్ 4, 5 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. గురువారం పోలింగ్ ఏర్పాట్లకు కేటాయించగా, శుక్రవారం పోలింగ్ జరుగుతుంది. పోలింగ్‌కు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 28 జిల్లాల్లోని 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 నామినేషన్లు, మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు 4,770 నామినేషన్లతో కూడిన తుది జాబితాను ప్రకటించారు.
పోటీ లేకుండానే ముగిసిన ఏకగ్రీవ ఫలితాల వివరాలను కూడా అందులో స్పష్టం చేసింది. 9,829 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ రాగా.. అందులో 1,985 స్థానాలు ఏకగ్రీవంగా ముగిశాయి. శాతాల పరంగా చూస్తే మొత్తం ఎంపీటీసీ స్థానాల్లో 20.20 శాతం ఏకగ్రీవమయ్యాయి.
అదే విధంగా 659 జడ్పీటీసీ స్థానాలకు గానూ 77 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది మొత్తం జడ్పీటీసీ స్థానాల్లో 11.7 శాతానికి సమానం. ఎంపీటీసీ ఏకగ్రీవాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు చూసుకుంటే.. పల్నాడు: 382, కడప: 358, మార్కాపురం: 217, అన్నమయ్య: 169, ప్రకాశం: 153 ఉన్నాయి.
జడ్పీటీసీ ఏకగ్రీవాల్లో ముందంజలో ఉన్న జిల్లాలు చూస్తే.. కడప: 23, పల్నాడు: 18, నంద్యాల: 8, మార్కాపురం: 6 ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో నమోదైన ఏకగ్రీవాల పూర్తి సమాచారాన్ని కూడా ఎస్ఈసీ తన సమగ్ర నివేదికలో పొందుపరిచింది.
ఏకగ్రీవాలు పోను, మిగిలిన 7,844 ఎంపీటీసీ స్థానాలకు, 582 జడ్పీటీసీ స్థానాలకు వచ్చే నెల 5వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలోనే పోటీ పడుతున్నారు.
ఎంపీటీసీ పోరులో 7,844 స్థానాలకు 18,952 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వైసీపీ: 7,632, టీడీపీ: 6,423, స్వతంత్రులు: 2,239, జనసేన: 1,521, కాంగ్రెస్: 326, బీజేపీ: 285, సీపీఎం: 259, బీఎస్పీ: 133, ఇతర పార్టీలు: 131, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP): 3 బరిలో ఉన్నారు.
ఇక జడ్పీటీసీ 582 స్థానాలకు పోరులో 2,169 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ: 574, స్వతంత్రులు: 503, టీడీపీ: 452, కాంగ్రెస్: 270, జనసేన: 109, బీఎస్పీ: 107, ఇతర పార్టీలు: 64, సీపీఎం: 47, బీజేపీ: 34, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP): 9 మంది ఉన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


