ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పారిశ్రామిక పెట్టుబడికి బాటలు సుగమమయ్యాయి. నెల్లూరు జిల్లాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఏర్పాటు చేయబోతున్న భారీ 'గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్' ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సుమారు రూ.1,03,408 కోట్ల భారీ వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు పర్యావరణ శాఖ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, రామాయపట్నం పోర్టు సమీపంలో నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. దేశంలోనే మూడో అతిపెద్ద ఇంధన శుద్ధి సంస్థ అయిన బీపీసీఎల్, నెల్లూరులో దాదాపు 5,200 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తోంది.
ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనాలు, రామాయపట్నం పోర్టుతో అనుసంధానించిన మెరైన్ క్రూడ్ ఆయిల్ టెర్మినల్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో 14,000 మందికి (400 ప్రత్యక్ష, 13,600 పరోక్ష) ఉపాధి లభిస్తుంది. కాంప్లెక్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక 5,000 మందికి (1,250 ప్రత్యక్ష, 3,750 పరోక్ష) ఉద్యోగాలు లభిస్తాయి.
పర్యావరణ సమతుల్యత కోసం కంపెనీ కేటాయించిన 5,200 ఎకరాల్లో 30 శాతానికి పైగా, అంటే 1,563 ఎకరాల్లో పచ్చదనం (గ్రీన్ బెల్ట్) ను అభివృద్ధి చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ ప్రణాళిక కోసం రూ.3,022 కోట్లు, పరిసర గ్రామాల అభివృద్ధి, సీఎస్ఆర్ కార్యకలాపాల కోసం మరో రూ.54 కోట్లను బీపీసీఎల్ కేటాయించింది. నిర్మాణ స్థలానికి 10 కిలోమీటర్ల పరిధిలో నేషనల్ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యాలు లేవని సంస్థ స్పష్టం చేసింది.
పారిశ్రామిక అవసరాలకు రోజుకు 2.25 లక్షల క్యూబిక్ మీటర్ల మంచి నీరు అవసరం కాగా, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే 'డీసాలినేషన్ ప్లాంట్' ద్వారా ఈ నీటిని సమకూర్చుకుంటారు. దీనికోసం రోజుకు 6.24 లక్షల క్యూబిక్ మీటర్ల సముద్రపు నీటిని డ్రా చేస్తారు.
{{/usCountry}}పారిశ్రామిక అవసరాలకు రోజుకు 2.25 లక్షల క్యూబిక్ మీటర్ల మంచి నీరు అవసరం కాగా, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే 'డీసాలినేషన్ ప్లాంట్' ద్వారా ఈ నీటిని సమకూర్చుకుంటారు. దీనికోసం రోజుకు 6.24 లక్షల క్యూబిక్ మీటర్ల సముద్రపు నీటిని డ్రా చేస్తారు.
{{/usCountry}}ఈ ప్రాజెక్టుకు మొత్తం 770 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా అందులో 185 మెగావాట్లను సొంత క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ద్వారా, మిగిలిన 585 మెగావాట్లను రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ ద్వారా పొందుతారు. ప్రస్తుతం బీపీసీఎల్ సంస్థ ముంబై, కొచ్చి, బినా (మధ్యప్రదేశ్)లలో రిఫైనరీలను నడుపుతోంది. వీటి సంయుక్త శుద్ధి సామర్థ్యం 35.3 మిలియన్ టన్నులుగా ఉంది.
సంస్థ వ్యాపార విస్తరణలో భాగంగా మొత్తం రూ.1.7 లక్షల కోట్ల కాపెక్స్ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అందులో శుద్ధి, పెట్రోకెమికల్స్ విభాగానికి కేటాయించిన రూ.75,000 కోట్లలో భాగమే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుకు అయ్యే భూసేకరణ, అధ్యయన వ్యయం (రూ.6,000 కోట్లు).