...
...
Next Story

ఏపీ నుంచి అరుణాచలం వెళ్లేవారికి శుభవార్త - గుంటూరు - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ పొడిగింపు!

Guntur Tirupati Train Extension : గుంటూరు - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నుంచి అరుణాచలం, శ్రీరంగం వెళ్లే భక్తులకు ఈ రైలు ఎంతోప్రయోజనకరం కానుంది.

Published on: May 10, 2026, 15:11:49 IST
Advertisement

Guntur Tirupati Train Extension : ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేరుస్తూ…. గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను (రైలు నంబర్లు: 17261/17262) తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.

మూడేళ్ల నిరీక్షణకు ఫలితం

గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ పొడిగింపు
గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ పొడిగింపు

ఈ రైలును తిరువణ్ణామలై (అరుణాచలం) వరకు పొడిగించాలని గత మూడేళ్లుగా భక్తులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ దిశగా సాగిన నిరంతర ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ అంశాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్….. వెల్లూరు, అరుణాచలం, శ్రీరంగం మీదుగా తిరుచిరాపల్లి వరకు ఈ రైలును నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ పొడిగింపు నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. నంద్యాల, కడప మీదుగా ప్రయాణించే ఈ రైలు ద్వారా భక్తులు ఇప్పుడు ఒకే ప్రయాణంలో పలు ప్రధాన క్షేత్రాలను దర్శించుకోవచ్చు.

  • కాణిపాకం: చిత్తూరు జిల్లాలోని స్వయంభూ వినాయక క్షేత్రం.
  • వెల్లూరు: ప్రసిద్ధ గోల్డెన్ టెంపుల్ (శ్రీపురం మహాలక్ష్మి ఆలయం).
  • తిరువణ్ణామలై: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అరుణాచలేశ్వర ఆలయం.
  • శ్రీరంగం: దక్షిణ భారత దేశంలోనే అత్యంత పవిత్రమైన రంగనాథస్వామి క్షేత్రం.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks