...
...
Next Story

Half day Schools : ఏపీలో ఒంటిపూట బడులు ఎప్పుట్నుంచో తెలుసా..? ఇవిగో వివరాలు

ఏపీలో ఒంటిపూట బడులపై కీలక అప్డేట్ వచ్చేసింది. మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయి.

Published on: Feb 21, 2026, 12:10:27 IST
Advertisement

ఏపీలో ఎండలు పెరుగుతున్నాయి…! చలి తీవ్రత తగ్గిపోగా… క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడుల ప్రారంభంపై ఏపీ సర్కార్ ఫోకస్ నిర్ణయం తీసుకుంది.

మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు…!

ఏపీలో ఒంటిపూట బడులు
ఏపీలో ఒంటిపూట బడులు

మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అధికారిక ఉత్తర్వలు వెలువడనున్నాయి.

ఒంటిపూట బడుల సమయంలో ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకూ తరగతులు నిర్వహిస్తారు. 12 గంటల 30 నిమిషాలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోనున్నారు.

మరోవైపు ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాలలో మాత్రం మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులు జరుగుతాయి.

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16న ప్రారంభమై ఏప్రిల్‌ ఒకటితో ముగుస్తాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పలు ప్రభుత్వ పాఠశాలలను కూడా టెన్త్ ఎగ్జామ్ సెంటర్లుగా ఎంపిక చేశారు. ఆయా స్కూళ్లలో మాత్రం… ఒంటిపూట బడుల నిర్వహణ మధ్యాహ్నం నుంచి ఉంటుంది. టెన్త్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత…. మిగతా స్కూళ్లలో మాదిరిగానే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రం బడులు తెరిచి ఉంచుతారు.

ఏపీ పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్…

  • మార్చి 16, 2026 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌
  • మార్చి 18, 2026 – సెకండ్‌ లాంగ్వేజ్‌
  • మార్చి 21, 2026 - ఇంగ్లీష్‌(ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20)
  • మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
  • మార్చి 25, 2026 – ఫిజిక్స్
  • మార్చి 28, 2026 – బయాలజీ
  • మార్చి 30 , 2026 – సోషల్‌ స్టడీస్‌
  • మార్చి 31, 2026 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌ 2)
  • ఏప్రిల్‌ 1, 2026 – ఒకేషనల్‌ కోర్సు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe