ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళదశమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది మే 12వ తారీఖున టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, కాలినడకబాటలో ఏడో మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి హనుమజ్జయంతినాడు ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.

తిరుమలలోని జపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంప్రదాయానుసారం టీటీడీ తరఫున శ్రీ జపాలి హనుమాన్‌కు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడో మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి అదే రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తుంది.
ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు, స్థానికుల సౌకర్యార్థం తిరుమల నుండి ఏడో మైలుకు, తిరిగి తిరుమల చేరడానికి టీటీడీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది.
టీటీడీ స్థానిక ఆలయాల్లో వేడుకలు
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలతో పాటు టీటీడీకి చెందిన ఇతర అనుబంధ ఆలయాల్లో మే 12న హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
శరణాగత భక్తికి, అచంచల శ్రీరామ సేవకు ప్రతీకగా నిలిచిన శ్రీ ఆంజనేయస్వామివారి జయంతిని టీటీడీ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వాహనసేవలు నిర్వహించనున్నారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనసేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తనుంది.
{{/usCountry}}తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనసేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తనుంది.
{{/usCountry}}తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఎదురు ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు.
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ సంజీవరాయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీటీడీ కోరింది.