హనుమాన్ జయంతి రోజున ఏం చేస్తే ఆంజనేయుడి ఆశీస్సులు మీపై ఉంటాయి?
భారతీయ ఆధ్యాత్మికతలో అత్యంత శక్తివంతమైన, ప్రేరణాత్మకమైన దైవం ఎవరంటే మనందరికీ గుర్తొచ్చే పేరు హనుమంతుడు. ధైర్యం, భక్తి, వినయం.. కలయికే ఆంజనేయుడు. హనుమాన్ జయంతి రోజున కొన్ని పనులు చేస్తే హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయి.
హనుమాన్ జయంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది భక్తి, శక్తి, అచంచలమైన విశ్వాసానికి ప్రతీక. హనుమాన్ జయంతి నాడు భక్తులు చేసే చిన్న ప్రయత్నం కూడా వారి జీవితాల్లో పెద్ద మార్పును తీసుకువస్తుంది. ఈ పవిత్ర దినాన మీ కోరికలు నెరవేరి, ఆయురారోగ్యాలు సిద్ధించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. మే 12వ తేదీన ఈసారి హనుమాన్ జయంతి వచ్చింది.

శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుడు వాయుదేవుని అంశతో పుట్టిన వాయుపుత్రుడు. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడిని పూజించడం వల్ల భయం తొలగిపోయి, మానసిక ధైర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం.
హనుమాన్ జయంతి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలు ముగించుకోవాలి. సింధూరం రంగు వస్త్రాలు ధరించడం ఆంజనేయుడికి అత్యంత ప్రీతికరం. పూజా గదిలో హనుమంతుడి విగ్రహం లేదా పటం ముందు దీపారాధన చేసి, మనసును రామనామ స్మరణతో నింపుకోవాలి.
హనుమంతుడికి తమలపాకుల మాల సమర్పించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. రామాయణ కాలంలో సీతమ్మ తల్లి హనుమంతుడికి ఆశీర్వచనంగా తమలపాకులను ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
ఒకసారి సీతమ్మ తల్లి నుదుటిన సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు, దాని అర్థం అడిగారు. అది రాముని ఆయుష్షు కోసమని తెలుసుకుని, తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు. అందుకే హనుమంతుడికి సింధూరమంటే అంత ప్రీతి.
రాహు దోష నివారణ కోసం, మానసిక ధైర్యం కోసం స్వామివారికి వడమాల సమర్పించడం దక్షిణ భారతదేశంలో ఒక ఆచారంగా వస్తోంది.
ఈ రోజున కనీసం 11 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశిస్తాయి. "రామ రక్షా స్తోత్రం" లేదా "సుందరకాండ"లోని కొన్ని ఘట్టాలను చదవడం వల్ల అపారమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
హనుమంతుడు సేవకు మారుపేరు. అందుకే హనుమాన్ జయంతి రోజున పేదలకు అన్నదానం చేయడం, కోతులకు పండ్లులాంటివి అందించడం వల్ల స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. రామ నామాన్ని స్మరిస్తూ చేసే ఏ చిన్న సేవ అయినా హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు మార్గం అవుతుంది.
హనుమాన్ జయంతి నాడు బాహ్యమైన ఆడంబరాల కంటే అంతర్గతమైన భక్తి ముఖ్యం. 'రామ' నామ జపం ఎక్కడ వినిపిస్తుందో, అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు. ఈ పవిత్ర దినాన ఆ చిరంజీవి ఆశీస్సులతో మీ కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుందాం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హనుమాన్ ఆలయాలు 'జై శ్రీరామ్' మరియు 'హనుమాన్ చాలీసా' పారాయణాలతో హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా కొండగట్టు, కపిలతీర్థం వంటి పుణ్యక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
మనోజవం మారుతతుల్యవేగం..
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం..
వాతాత్మజం వానర యూధముఖ్యం..
శ్రీరామదూతం శిరసా నమామి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


