ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు అప్లై చేశారా? దరఖాస్తులకు అక్టోబర్ 27 లాస్ట్ డేట్

APPSC Group 1 Jobs : ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి ఉండి అప్లై చేయనివారు ఉంటే అక్టోబర్ 27వ తేదీలోపు అప్లై చేయాలి.

Published on: Oct 22, 2026, 17:51:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ నడుస్తోంది. గ్రూప్-1 సర్వీసెస్ పరిధిలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 166 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 రకాల విభాగాల్లో 166 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1
ఏపీపీఎస్సీ గ్రూప్ 1

డిప్యూటీ కలెక్టర్లు : 12 పోస్టులు

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 14 పోస్టులు

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్): 36

డీఎస్పీ (కమ్యూనికేషన్స్): 03

జిల్లా విద్యాధికారి (డీఈఓ): 14 పోస్టులు

రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ఆర్‌టీఓ): 03

జిల్లా గిరిజన సంక్షేమాధికారి: 01 పోస్టు

డిప్యూటీ రిజిస్ట్రార్: 16 పోస్టులు

మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 12

అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 02

జిల్లా ఉపాధి కల్పనాధికారి: 03

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 15

డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీఎల్‌డీఓ): 35 పోస్టులు

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదేని సబ్జెక్ట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే డీఎస్పీ (కమ్యూనికేషన్స్)కి మాత్రం బి.ఇ లేదా బి.టెక్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ / రేడియో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

01.07.2026 నాటికి సాధారణ వయోపరిమితి 18-44 ఏళ్లు కాగా, కొన్ని ప్రత్యేక కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10, మాజీ సైనికోద్యోగులకు/ NCC ఇన్‌స్ట్రక్టర్లకు సేవ చేసిన కాలం ప్లస్ 3 ఏళ్లు ఉంటుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 5 ఏళ్లు సడలింపు దొరుకుతుంది.

గ్రూప్-1 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్ - ఆఫ్‌లైన్ OMR ఆధారిత), మెయిన్స్ పరీక్ష (డిస్క్రిప్టివ్ తరహా), ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది. మెయిన్స్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 250, పరీక్ష ఫీజు: రూ. 120 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, ఏపీలోని తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న పేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు పరీక్ష ఫీజు (రూ. 120) నుంచి మినహాయింపు ఉంది.

ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 6వ తేదీన ప్రారంభమయ్యాయి. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 27 వరకు ఉన్నాయి. చివరి తేదీ దగ్గర పడుతుంది. ప్రిలిమ్స్ జనవరి 24న ఉంటుంది. మెయిన్స్ పరీక్ష తేదీలు తరువాత ప్రకటిస్తారు.

ఎలా అప్లై చేయాలి?

ముందుగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in సందర్శించాలి.

కొత్త అభ్యర్థులు మొదట One Time Profile Registration (OTPR) పూర్తి చేసి OTPR ID పొందాలి.

అనంతరం లాగిన్ అయి "Online Application Submission" లింక్ ద్వారా సంబంధిత నోటిఫికేషన్ ఎంచుకోవాలి.

వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలను పూరించి, సబ్మిట్ చేసి ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు కాపీ ప్రింటవుట్ తీసుకుని ఉంచుకోవాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More