AP Weather : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం!
AP Weather Update : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
ఉత్తర బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్‌లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రభావంతో గురువారం అనకాపల్లి జిల్లాలో విస్తారంగా వర్షం కురిశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడినాయి. ఈ వర్షాలు జనాలకు కాస్త ఉపశమనం కలిగించాయి.

శుక్రవారం ఉత్తరంధ్రా తీరం తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం సముద్రంలోకి వెళ్లవద్దని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసింది.
ఆర్థిక, గణాంకాల డైరెక్టరేట్ (డీఈఎస్) వద్ద అందుబాటులో ఉన్న రియల్-టైమ్ వర్షపాత సమాచారం ప్రకారం, సాయంత్రం 6 గంటల సమయానికి... గురువారం ప్రకాశం జిల్లాలోని తల్లూరులో అత్యధికంగా 38.85 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత అనకాపల్లి జిల్లాలోని దర్లపూడిలో (37.5 మిల్లీమీటర్లు), అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం, పారవాడ మరియు వూడూరులలో (34.5 మిల్లీమీటర్లు), అనకాపల్లిలోని గంధవరంలో (34 మిల్లీమీటర్లు), గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో (31 మిల్లీమీటర్లు), ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో (15 మిల్లీమీటర్లు) వర్షపాతం నమోదైంది.
గురువారం విజయవాడలో కుండపోత వర్షం కురిసిన తర్వాత, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సమీపంలోని జలమయమైంది. రహదారిపై వాహనాలు ప్రయాణించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి.
విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, పోలవరం, శ్రీకాకుళం, ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, మార్కాపురం, గుంటూరు జిల్లాల్లోనూ సాయంత్రం 6 గంటల వరకు చిరు జల్లులు పడ్డాయి. రాష్ట్రంలో శనివారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ సూచన ప్రకారం.. శుక్రవారం నాడు ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇతర తీరప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల్లో శనివారం నాడు కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


