...
...
Next Story

ఏపీకి బిగ్ అలర్ట్ - భారీ వర్షాలు కురిసే ఛాన్స్..! ఐఎండీ అంచనాలు ఇలా

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తీవ్రమై అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 23 వరకు ఏపీ, రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.

Published on: Oct 21, 2026, 05:12:39 IST
Advertisement

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ, ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఫలితంగా అక్టోబర్ 23వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని అంచనా వేసింది.

ఏపీకి భారీ వర్ష సూచన
ఏపీకి భారీ వర్ష సూచన

రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు పుదుచ్చేరి పరిధిలోని యానాం ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలతో పాటు గంటకు ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు, ప్రత్యేకించి పొలాల్లో పనిచేసే రైతులు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు…!

ప్రస్తుతం వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ అకస్మాత్తు మార్పులకు ప్రధానంగా రెండు వాతావరణ వ్యవస్థలు కారణమని అధికారులు స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతం మరియు దానికి అనుకొని ఉన్న తమిళనాడు తీరంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం విస్తరించి స్థిరంగా కొనసాగుతోంది. ఈ ఆవర్తనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మరోవైపు, నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరం నుంచి ప్రారంభమైన ఒక ద్రోణి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇదిలా ఉండగా…. గురువారం నాటికి మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో రూపుదిద్దుకోబోతోంది.

ఆ తర్వాత ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి అక్టోబర్ 23 నాటికి ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి వాయవ్య దిశగా ప్రయాణించి తీవ్ర రూపం దాల్చవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్ష సూచనలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ లోని వివరాల ప్రకారం… ద్రోణి ప్రభావంతో ఇవాళ (21-10-2026) పోలవరం, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks