Andhrapradesh Weather Updates :దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం మరింత బలపడుతోందని వాతావరణశాఖ పేర్కొంది. రాబోయే 24 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల మీదుగా కదిలే అవకాశం ఉంది.

తాజా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో శని, ఆదివారాల్లో (నేడు, రేపు) రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానుండగా…. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
జిల్లాల వారీగా వర్ష సూచన:
ఇవాళ శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి.
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఆపై తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుసే సూచనలున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
రాగల 2 గంటలు కోనసీమ,పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు…
{{/usCountry}}రాగల 2 గంటలు కోనసీమ,పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు…
{{/usCountry}}భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను తక్షణమే ఏర్పాటు చేయాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ఆదేశించారు.ఎప్పటి ఎప్పటికప్పుడు సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.