బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం - ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు! ఐఎండీ హెచ్చరికలివే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
ఉత్తర అండమాన్, దానికి ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా, ఆ తరువాతి రోజుకు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ వివరాల ప్రకారం.... బుధవారం ఉదయానికి ఇది దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమమధ్య - వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశముంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారే సూచనలున్నాయి.
నాలుగు రోజుల పాటు వర్షాలు
ఈ అల్పపీడన ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయి. ఇక బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇవాళ (21-09-2026) రోజున రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉంది.
మత్స్యకారులకు హెచ్చరికలు....
కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

