...
...
Next Story

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. ఉక్కుద్రవం లీకై 9 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం!

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3 హీట్‌ ఎఫ్‌జీలో భారీ మొత్తంలో ఉక్కుద్రవం లీకై మంటలు చెలరేగి.. పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు.

Updated on: Jun 8, 2026, 18:06:20 IST
By , Visakhapatnam
Prefer HTon Google
Advertisement

విశాఖ ఉక్కు కర్మాగారం (Vizag Steel Plant) లో సోమవారం అత్యంత ఘోరమైన ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్-2 (SMS-2) విభాగంలో ఉన్న ఎస్‌టీసీ-3 (STC-3) హీట్ ఎఫ్‌జీ వద్ద భారీ మొత్తంలో ద్రవరూపంలో ఉన్న ఉక్కు (Hot Liquid Steel) లీకవడంతో ఈ విపత్తు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో భారీ క్రేన్ సహాయంతో కరిగిన ఉక్కు ద్రవాన్ని పైకి లిఫ్ట్ చేస్తుండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన ఉక్కుద్రవం ఒక్కసారిగా కిందకు లీకైంది. అధిక ఉష్ణోగ్రత ఉన్న ఉక్కు ద్రవం కింద పడటంతో ఆ ప్రాంతమంతా క్షణాల వ్యవధిలో మంటలు చెలరేగాయి. అక్కడ విధుల్లో ఉన్న కార్మికులకు తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే స్టీల్ ప్లాంట్ అంతర్గత విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి, లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి తీవ్రంగా శ్రమించారు. దట్టమైన పొగ, తీవ్రమైన వేడి కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పలువురు కార్మికులను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ శాతం మంది తీవ్రమైన కాలిన గాయాలకు గురయ్యారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe