పల్నాడు జిల్లా దుర్గి మండలం అగిగొప్పల గ్రామంలో ఘోరమైన ఘటన జరిగింది. ఇద్దరు అన్నదమ్ముళ్లను గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే ఇద్దరూ ఓ పార్టీకి సానుభూతిపరులు. రాజకీయ కారణాలతోనే హత్య చేశారా? లేదంటే వేరే కారణాలతోనా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రతీకాత్మక చిత్రం
{{^htLoading}} {{/htLoading}}
కొత్తా హనుమంతు, కొత్తా శ్రీరాంమూర్తి అనే ఇద్దరు అన్నదమ్ముళ్లను నరికి చంపారు. శ్రీరాంమూర్తిని అమ్మవాడి గుడి సమీపంలో చంపేశారు. హనుమంతును గ్రామం మధ్యలోనే అత్యంత కిరాతకంగా నరికారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ మెుదలుపెట్టారు. ఈ హత్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వదినను రోకలి బండతో కొట్టి
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామంలో దారుణమైన ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గంగావతి అనే మహిళ మూడు నెలల క్రితం తన భర్త అహోబిలాన్ని ప్రియుడితో హత్య చేయించింది. ఇటీవల బయటకు వచ్చింది. గ్రామంలోనే నివాసం ఉంటోంది. తన అన్నను చంపడంతో పెద్దయ్య కక్ష పెంచుకున్నాడు. వదినను ఎలాగైనా చంపాలనుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లిన వదినను రోకలి బండతో కొట్టి చంపాడు పెద్దయ్య. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని కో లివింగ్ హాస్టల్‌లో డ్రగ్స్ దందా బయటకు వచ్చింది. అంజయ్య నగర్‌లోని కో లివ్ గెర్నట్ పీజీలో డ్రగ్స్ దందా సాగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులు, డ్రగ్స్‌ను వినియోగిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్, ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సరఫరాదారులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డ్రగ్ పెడ్లర్లు వంశీ దిలీప్, బాల ప్రకాశ్. కస్టమర్లు హైదరాబాద్‌కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్‌గా గుర్తించారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.