ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అతను ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై భారీ ట్యాంకర్ బోల్తా పడటమే దీనికి కారణం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నివేదికల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యాయవాది బి.శ్రీనివాసరావు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అతివేగంతో వచ్చిన భారీ ట్యాంకర్ డివైడర్‌ను ఎక్కి, శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై బోల్తా పడింది. దీంతో వాహనం పూర్తిగా నలిగిపోయింది... నుజ్జు.. నుజ్జు అయింది. ఐదు క్రేన్ల సహాయంతో అతికష్టం మీద ట్రక్కును పక్కకు తొలగించి మృతదేహాన్ని వెలికితీశారు.
హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ వాహనం డివైడర్ ఢీకొని కారుపై పడింది. టోల్ గేట్ సిబ్బంది ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. నుజ్జునుజ్జు అయిన కారు నుంచి మృతదేహాన్ని వెలికితీయడానికి ముందు, క్రేన్లు, జేసీబీ సహాయంతో రెండు గంటల పాటు ప్రయత్నాలు చేశారు.
ఈ ఘటన జరిగినప్పుడు బాధితుడు న్యాయవాది బి. శ్రీనివాసరావు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. ప్రమాద స్థలం వద్ద భారీగా జనాలు గుమిగూడటంతో, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భారీ ట్యాంకర్ బరువు కారణంగా కారు నుజ్జునుజ్జైపోయింది. మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో ఉంటే హైకోర్టు న్యాయవాది శ్రీనివాసరావు అమరావతి నిర్మిస్తున్న తన కార్యాలయ పనులను పరిశీలించేందుకు వచ్చారని తెలుస్తోంది. కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద శనివారం సాయంత్రం ప్రమాదం జరిగింది.
ఫ్లైయాష్ నింపుకొని వస్తున్న భారీ ట్యాంకర్ టోల్ ప్లాజా దగ్గర అదుపుతప్పి కారు మీద పడింది. డ్రైవర్ నియంత్రించలేకపోవడంతోనే ఈ ఘటన జరిగింది. న్యాయవాది శ్రీనివాసరావు స్టీరింగ్‌కు అతుక్కుపోయారు. శ్రీనివాసరావుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లోనూ ప్రాక్టీస్ చేస్తున్నారు.
{{/usCountry}}ఫ్లైయాష్ నింపుకొని వస్తున్న భారీ ట్యాంకర్ టోల్ ప్లాజా దగ్గర అదుపుతప్పి కారు మీద పడింది. డ్రైవర్ నియంత్రించలేకపోవడంతోనే ఈ ఘటన జరిగింది. న్యాయవాది శ్రీనివాసరావు స్టీరింగ్‌కు అతుక్కుపోయారు. శ్రీనివాసరావుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లోనూ ప్రాక్టీస్ చేస్తున్నారు.
{{/usCountry}}ట్యాంకర్ డ్రైవర్ తమిళనాడుకు చెందిన జేవియర్ ఆంటోని స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం జరిగినట్టుగా డ్రైవర్ చెబుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద స్థలం వద్ద భారీగా జనాలు గుమిగూడటంతో, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.