ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన మళ్లీ తెరపైకి వచ్చేసింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్ని పునర్విభజించటమే కాదు… ఏకంగా వాటి సంఖ్య 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. నిజానికి ఈ అంశంపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నప్పటికీ… ఇదంతా ఇప్పుడు అవుతుందా..? అన్న అనుమానాలు, అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ వచ్చాయి కానీ 2029 ఎన్నికల నుంచే అమలులోకి వస్తుందనే సంకేతాలు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.
నియోజకవర్గాల పునర్విభజన : ఎన్ని సీట్లు పెరుగుతాయి..?
- నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీ, తెలంగాణలో భౌగోళికంగా కీలక మార్పులుంటాయి. అంతేకాకుండా సీట్ల సంఖ్య భారీగానే పెరుగుతుంది.
- ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే విభజన చట్టం ప్రకారం… ఈ సంఖ్యను 225కి పెంచుతామని కేంద్రం హామీ కూడా ఇచ్చింది. కానీ ఇది ఇంకా అమలు కాలేదు. ఈ లెక్క అంటే 29 శాతం సీట్లు పెరిగేవి. కానీ ప్రస్తుతం 50 శాతం సీట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంతో ఏపీలో శాసనసభ నియోజవర్గ సీట్ల సంఖ్య ఏకంగా 263కి పెరుగుతుంది.
- ఇదే ప్రతిపాదికన చూస్తే… తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుంచి 179కి పెరిగే అవకాశం ఉంటుంది.
- ఏపీలో ప్రస్తుతం పార్లమెంట్ స్థానాల సంఖ్య 25గా ఉంది. ఈ స్థానాల సంఖ్య 37 లేదా 38కి పెరిగే అవకాశం ఉంటుంది.
- ఇక తెలంగాణలో లోక్‌సభ నియోకవర్గాల సంఖ్య ప్రస్తుతం 17గా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ సంఖ్య 26కు పెరిగే అవకాశం ఉంటుంది.
- నియోజవర్గాల పునర్విభజన నేపథ్యంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ (ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌తో కలిపి) అమలు చేస్తే… వారికి ప్రాతినిధ్యం భారీగా పెరిగే అవకాశం ఉంది.
- ఏపీలో మహిళలకు 33 శాతం అంటే…. 86 లేదా 87 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ అవుతాయి. ఇక లోక్‌సభ స్థానాలు 37 లేదా 38కి పెరిగితే…. అందులో మహిళలకు 33 శాతం అంటే 12 లేదా 13 స్థానాలు రిజర్వ్ కావొచ్చు.
- ఎస్సీ, ఎస్టీల జనాభా గరిష్టంగా ఉండే లోక్‌సభ, శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు రిజర్వు చేసే అవకాశం ఉంటుంది.
- నియోజకవర్గాల పునర్ విభజన జరిగేతే… ఏపీ, తెలంగాణలో మంత్రివర్గ కోటా కూడా పెరుగుతుంది.
- ఈ పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.ప్రస్తుతం ఉన్న స్థానాలకు 50 శాతం సీట్లు పెంచుతూ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపడితే… జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండదని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. ఇటీవలే కాలంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించారు.
- లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో 50 శాతం మేరకు సీట్లను పెంచాలన్న నిర్ణయం…. ఏ ప్రాతిపదికన చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఇక 2011 నాటి జనాభా లెక్కల్ని ప్రామాణికంగా తీసుకుని ఈ కార్యాచరణను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}