AP Ration Card Status : ఏపీ రేషన్ కార్డు స్టేటస్, e-KYC వివరాలు ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి?

AP Ration Card Status : కొందరికి ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులకు సంబంధించిన వివరాలను ఎక్కడ చూసుకోవాలనే విషయంపై క్లారిటీ లేదు. అంతేకాదు ఈకేవైసీ పెండింగ్ ఉందా లేదా అనేది కూడా కొందరికి తెలియకుండా ఉంది. అలాంటివారు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

Published on: Oct 5, 2026, 17:16:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డుదారుల తమ వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. కుటుంబ సభ్యుల వివరాలు, ఈ-కేవైసీ అప్డేట్ అయిందా.. లేదంటే పెండింగ్‌లో ఉందో చెక్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు వివరాలు తెలుసుకోవడానికి, అందులో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి గ్రామ/వార్డు సచివాలయాలు లేదా సివిల్ సప్లై ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

ఏపీ రేషన్ కార్డ్ స్టేటస్
ఏపీ రేషన్ కార్డ్ స్టేటస్

epos.ap.gov.in పోర్టల్ ద్వారా ఇంట్లో ఉండే మొబైల్ లేదా కంప్యూటర్ సాయంతో ఆన్‌లైన్‌లోనే వివరాలన్నీ తెలుసుకునే వెసులుబాటు ఉంది. రేషన్ కార్డు వివరాలను అత్యంత సులభంగా చెక్ చేయడానికి కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి.

చెక్ చేసే విధానం

అధికారిక వెబ్‌సైట్ https://epos.ap.gov.in/rc-details ఓపెన్ చేయండి.

Ration Card Analysis మీద క్లిక్ చేసి.. Ration Card Search మీద క్లిక్ చేయాలి.

సెలెక్ట్‌లో ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయాలి.

ఆ తర్వాత రేషన్ కార్డ్ ఐడీ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు వివరాలు కనిపిస్తాయి.

అక్కడ లభించే Enter RC Number ఫీల్డ్‌లో మీ రేషన్ కార్డు నంబర్‌ను ఎలాంటి తప్పులు లేకుండా సరిగ్గా టైప్ చేయాలి. నంబర్ ఎంటర్ చేసిన తర్వాత Search బటన్‌పై క్లిక్ చేస్తే మీ కార్డుకు సంబంధించిన పూర్తి డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ ఆన్‌లైన్ సేవ ద్వారా లబ్ధిదారులు తమ కార్డుకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను పరిశీలించవచ్చు. లెఫ్ట్‌సైడ్‌లో రేషన్ కార్డు సమ్మరీ కనిపిస్తుంది. జిల్లా, బ్లాక్ ఇలా పలు వివరాలు ఉంటాయి.

ఇక రైట్ సైడ్‌ కార్డులో కుటుంబ యజమాని పేరుతో పాటు అనుసంధానమై ఉన్న ఇతర ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు, వారి పేర్లు కనిపిస్తాయి. అంతేకాదు ఈకేవైసీ పెండింగ్‌లో ఉంటే.. e-KYC pending అని స్టేటస్ కనిపిస్తుంది. కుటుంబంలోని ఎంతమంది సభ్యులకు e-KYC పూర్తయింది, ఎవరికి పెండింగ్‌‌లో ఉందో పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఆన్‌లైన్ RC Details పేజీ కేవలం వివరాలను చూడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పేరు మార్చాలన్నా, కొత్త సభ్యులను చేర్చాలన్నా లేదా e-KYC పూర్తి కాకపోతే వెంటనే మీ సమీప సచివాలయం లేదా ప్రభుత్వ సేవా కేంద్రానికి వెళ్లి వివరాలు అడగాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More