AP Telangana Delimitation Seats : లోక్ సభ తో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా రిజర్వేషన్ల తో పాటుగా డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి….. ఆమోదం దిశగా తుది కసరత్త జరుగుతోంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.

కేంద్ర ప్రతిపాదనలు ఆమోదం పొందితే రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. నాలుగు రోజుల పాటు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశమై, డీలిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించేలా కేంద్రం వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
తెలంగాణలో సీట్ల లెక్క ఎలా..?
తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రతిపాదిత బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ స్థానాల సంఖ్య 26కు చేరే అవకాశం ఉంది. 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అదనంగా రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున పెంచాలని ప్రతిపాదించారు. ఆ లెక్క ప్రకారం 34 సీట్లు పెరగాల్సి ఉండగా….. తాజా బిల్లులో ప్రతి రాష్ట్రంలో నేరుగా 50 శాతం స్థానాలు పెంచేలా ప్రతిపాదన తెచ్చారు.
ఈ 50 శాతం పెంపు అమలైతే తెలంగాణకు కొత్తగా 60 అసెంబ్లీ స్థానాలు వస్తాయి. మరోవైపు, ఒక్కో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడు సెగ్మెంట్ల చొప్పున లెక్కిస్తే మొత్తం అసెంబ్లీ స్థానాలు 182కి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పెంచితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందేమోనన్న ఆందోళన గతంలో వ్యక్తమైంది. అన్ని రాష్ట్రాల్లో సమాన నిష్పత్తిలో సీట్లు పెంచడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మార్పులు అమలైతే ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 50 శాతం సీట్ల పెంపుతో అసెంబ్లీ స్థానాలు 179కి, లోక్‌సభ స్థానాలు 25 వరకు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్ర జనాభా ఆధారంగా చూస్తే ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు సగటున 3.22 లక్షల జనాభా ఉండగా, 179 స్థానాలు ఏర్పడితే అది సుమారు 2.14 లక్షలకు తగ్గుతుంది. అలాగే ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ప్రస్తుతం సగటున 22.58 లక్షల జనాభా ఉండగా…. పెంపు తర్వాత 15.36 లక్షలకు చేరవచ్చు.
{{/usCountry}}తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 50 శాతం సీట్ల పెంపుతో అసెంబ్లీ స్థానాలు 179కి, లోక్‌సభ స్థానాలు 25 వరకు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్ర జనాభా ఆధారంగా చూస్తే ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు సగటున 3.22 లక్షల జనాభా ఉండగా, 179 స్థానాలు ఏర్పడితే అది సుమారు 2.14 లక్షలకు తగ్గుతుంది. అలాగే ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ప్రస్తుతం సగటున 22.58 లక్షల జనాభా ఉండగా…. పెంపు తర్వాత 15.36 లక్షలకు చేరవచ్చు.
{{/usCountry}}ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024 నాటికి తెలంగాణ జనాభా సుమారు 3.84 కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ కుల గణన సర్వేలో దాదాపు 3.71 కోట్ల జనాభా నమోదైనట్లు సమాచారం. రాబోయే జనగణనలో వెలువడే అధికారిక గణాంకాలు పునర్విభజనకు కీలకంగా మారనున్నాయి.
జనాభా నిష్పత్తి ప్రకారం కొత్త స్థానాలు ఏర్పాటు చేస్తే ప్రస్తుత నియోజకవర్గాల సరిహద్దులు మారిపోతాయి. కొన్ని నియోజకవర్గాలు రెండు లేదా మూడు కొత్త స్థానాలుగా విడిపోవచ్చు. మరికొన్నిచోట్ల జనాభా కోటాను సమన్వయం చేయడానికి పక్కపక్క గ్రామాలను, మండలాలను కలపాల్సి రావచ్చు. దీనివల్ల నియోజకవర్గాల పేర్లు, పరిధులు, రాజకీయ సమీకరణాల్లో మార్పులు వస్తాయి.
లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. సీట్ల పెంపు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేసేలా కసరత్తు సాగుతోంది.
ఏపీలో ఇలా..
ఈ బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి. 4,123గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185కి చేరతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, 25 లోక్ సభ స్థానాలు…38కి చేరుతాయి. ఏపీలో పెరిగే లోక్ సభ సీట్ల సంఖ్య విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే….. ఏపీలో 13 లోక్‌సభ, 87 అసెంబ్లీ సీట్లు వారికి దక్కొచ్చు. ఇక తెలంగాణలో 9 లోక్‌సభ, 60 అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ మేరకు స్థానాలను ఖరారు చేస్తారు. అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే…. 2029 ఎన్నికల నుంచే పూర్తిగా రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే ప్రాథమిక అంచనా లెక్కలు మాత్రమే ఉండగా…. అధికారిక పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాకే తుది సంఖ్యలు వెల్లడవుతాయి.
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.