అరకు లోయకు పొటెత్తిన పర్యాటకులు - ఈ టూరిస్ట్ స్పాట్ టైమింగ్స్ మార్పు..! తాజా వివరాలివిగో
టూరిస్ట్ ప్రాంతమైన అరకు లోయ పర్యాటకులతో నిండిపోయింది. ఇయర్ ఎండ్, వరుస సెలవులతో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగిపోయింది. దీంతో చుట్టుపక్కల ఉన్న హోటల్స్ అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి.
ఓవైపు వరుస సెలవులు… అందులోనూ వీకెండ్..! అంతేకాకుండా ఇయర్ ఎండ్ కావటంతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు పర్యాటకులు క్యూ కట్టారు. ఏజెన్సీలో ఎక్కడ చూసినా సందర్శకులతో సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా అరకు లోయంతా కూడా టూరిస్టులతో కిక్కిరిసిపోయిన పరిస్థితులు ఉన్నాయి.

హోటళ్లకు భారీ డిమాండ్…
భారీగా టూరిస్టుల వస్తుండటంతో… అరకు లోయలో హోటల్స్ అన్ని హౌస్ ఫుల్ అయిన పరిస్థితులు ఉన్నాయి. చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు… టూరిస్టులు తెగ తరలివ్తున్నారు. దట్టమైన పొగమంచు అందాలను కెమెరాలను బంధిస్తున్నారు. విశాఖ, అరకు, పాడేరుల్లో హోటల్స్ కి తెగ డిమాండ్ పెరిగింది.
బొర్రా గుహలు, జలపాతాలు, అరకు లోయ, మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, చాపరాయి గెడ్డ, పాడేరు కాఫీ తోటలు, వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం, లంబసింగి ప్రాంతాల్లో టూరిస్టుల రద్దీ ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు భారీగా వస్తున్నారు.
ముఖ్యంగా మాడగడ, వంజంగి మేఘాల కొండ వ్యూ పాయింట్లకు పలు రాష్ట్రాల నుంచి నుంచి పర్యాటకులు పోటెత్తిరావడంతో రద్దీ నెలకొంది. శనివారం రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈరోజు కూడా భారీగా పర్యటకులు సందర్శించే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కూడా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.
టైమింగ్స్ మార్పు…
ఇక అరకు వ్యాలీలో ఇటీవల ప్రాధాన్యత సంతరించుకున్న టూరిస్ట్ స్పాట్స్ లో ఉడెన్ బ్రిడ్జ్ ఒకటిగా నిలిచింది. సుంకరమెట్ట సమీపంలో ఇది ఉంటుంది. అయితే ప్రస్తుతం టూరిస్టుల రద్దీ పెరగడం, ఘాట్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో అధికారులు సందర్శన వేళల్లో మార్పులు చేశారు. ఇవాళ్టి నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, ఆపై మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ బ్రిడ్జిని సందర్శించవచ్చు. మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకు బ్రిడ్జ్ సందర్శనకు అనుమతి ఉండదు.
పర్యాటక శాఖ అధికారుల ప్రకారం… నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు జిల్లాల్లోని హోటళ్లు పూర్తిగా నిండిపోయి. ఈ ట్రెండ్ సంక్రాంతి పండుగ వరకు కొనసాగే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

