భార్యను చంపేసి డెడ్‌బాడీని బైక్‌ మీద పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన భర్త!

బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌కు బైక్ మీద తీసుకొచ్చాడు.

Published on: Dec 14, 2025, 14:56:40 IST
By , Bapatla
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గృహ హింస కేసులో భాగంగా ఒక వ్యక్తి తనతో విడిపోయిన భార్యను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని తన మోటార్‌సైకిల్‌పై ఉంచి పోలీస్ స్టేషన్‌ తీసుకొచ్చి లొంగిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, మాచవరానికి చెందిన మహాలక్ష్మి (28) ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నిరంతరం గొడవల కారణంగా మహాలక్ష్మి వెంకటేశ్వర్లు నుంచి విడిపోయింది. వేరుగా ఉంటుంది. తన బతుకు తాను బతుకుతుంది.

ఆదివారం నాడు, వెంకటేశ్వర్లు మాచవరం వెళ్లి మహాలక్ష్మిని కలిశాడు. బంగారం ఇస్తానని చెప్పి గ్రామ శివార్లకు తనతో పాటు తీసుకెళ్లాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని తన మోటార్ సైకిల్ పై పెట్టుకుని సంతమాగులూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయాడు.

పోలీసులు వెంటనే ఆ మహిళను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది ఆమె మరణించి చాలాసేపు అయినట్టుగా వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

క్లాస్ వింటూ కుప్పకూలిన విద్యార్థి

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. బెంచ్ మీద కూర్చుని పాఠాలు వింటున్న బాలిక ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది. రామచంద్రపురం నియోజకవర్గంలోని పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి అనే 14 ఏళ్ల బాలిక ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. శనివారం రోజూ మాదిరిగానే స్కూల్‌కు వెళ్లింది. క్లాస్ రూమ్‌లో టీచర్ పాఠాలు చెబుతుండగా.. బెంచ్‌పై కూర్చోని పాఠాలు విన్నది.

అయితే ఒక్కసారిగా సిరి కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో తెలియక టీచర్, తోటి విద్యార్థులు సిరిని పైకి లేపి చూశారు. కానీ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతో బాలిక మరణించినట్టుగా వెల్లడించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుమార్తెతో మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More