...
...
Next Story

మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.. ఆయా, హౌస్ కీపర్, యోగా టీచర్ జాబ్స్!

కర్నూలు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

Published on: Feb 4, 2026, 16:15:47 IST
Advertisement

ఏపీలోని కర్నూలు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెల్లడించారు. వివిధ విభాగాల్లో పలు ఖాళీలు ఉన్నాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశుగృహ నందు ఖాళీగా వున్న ఆయా-2(కాంట్రాక్టు పద్ధతి), పెద్దపాడు బాలసదనంలో ఖాళీగా వున్న హస్ కీపర్ 1, పత్తికొండ బాలసదనంలో ఖాళీగా వున్న పార్ట్ టైం పద్ధతిలో ఇన్ట్స్‌క్టర్ కమ్ యోగా టీచర్-1 నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అభ్యర్థులు ఈ నెల 02.02.2026 నుండి 09.02.2026లోగా పని దినాల్లో ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 వరకు కలెక్టరేట్‌లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్ నెం.122, కర్నూలులో దరఖాస్తులు సమర్పించాలి.

విద్యార్హతలు, పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ http://kurnool.ap.gov.in// ను మరియు కార్యాలయము నోటిస్ బోర్డులో చూసుకోవచ్చు. వయోపరిమితి 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

అభ్యర్థి తన సొంత చిరునామాతో రెండు కవర్లకు తగిన స్టాంపులు అతికించి ధరఖాస్తుకు జతపరచాలి. అభ్యర్థి వివరాలు నిర్దిష్ట ఫార్కెట్‌లో రాసి ఫోటో అతికించవలెను.

పోస్టుకు అవసరమయ్యే అన్ని ధ్రువపత్రముల జిరాక్స్ కాపీలను(గేజిటెడ్ అధికారితో సంతకం చేయించి) జతపరచాలి. పనిదినాల్లో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమం, సాధికారిత అధికారి కార్యాలయం కర్నూలులో తేది: 09.02.2026 సాయంత్రము 5 00 గంటల లోపల సమర్పించాలి.

జీతం ఆయాకు నెలకు రూ.7944, హౌస్ కీపర్‌కు 7944, యోగా టీచర్‌కు రూ.10,000 వరకు అందిస్తారు. మెటిర్, తదితర విషయాల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం కర్నూలు వెబ్‌సైట్ http://kurnool.ap.gov.in ను చూడవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe