హిస్టారికల్ డేటా ఆధారంగా వ్యాధుల తీవ్రత ప్రాంతాల గుర్తింపు

ఆరోగ్యశాఖ‌లో 'అవేర్' సేవ‌లు తీసుకువస్తున్నట్టుగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. హిస్టారికల్ డేటా ఆధారంగా వ్యాధుల తీవ్రత ప్రాంతాల గుర్తించనున్నట్టుగా తెలిపారు.

Published on: Jan 18, 2026, 20:28:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో సీజిన‌ల్ డిసీజెస్‌ను రియ‌ల్ టైమ్‌లో ప‌ర్యవేక్షించి వ్యాధులు వాప్తి చెందకుండా చ‌ర్యలు తీసుకోవ‌డానికి రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్‌)లోని అవేర్ విభాగం సేవ‌ల‌ను ఉపయోగించుకోనున్నట్టుగా వైద్యారోగ్య శాఖ మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచ‌న‌ల మేరకు రాష్ట్రంలో వ్యాధులు ప్రబ‌ల‌కుండా సాంకేతిక‌త‌ను స‌మ‌ర్థవంతంగా వినియోగించుకునే దిశ‌గా వైద్య, ఆరోగ్యశాఖ అడుగులు వేస్తోంద‌న్నారు.

ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం

ఇందుకోసం ఆర్టీజీఎస్‌లోని అవేర్(అడ్వాన్స్ వార్నింగ్ అడ్వైజ‌రీ ఫ‌ర్‌ రిసిలియెంట్ ఎకోసిస్టమ్) ద్వారా రాష్ట్రంలో వ్యాధుల తీవ్రత‌, వ్యాప్తికి ఉన్న అవ‌కాశాల‌ను ప్రాథ‌మిక ద‌శ‌లోనే గుర్తించి వాటిని స‌త్వరం నివారించే దిశ‌గా త్వరలో చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు.

పాత డేటా

గ‌త ఐదారు సంవత్సరాల్లో(హిస్టారికల్ డేటా) గ్రామాలు, స‌చివాయాల‌యాల వారీగా అంటువ్యాధులు (డెంగీ, మలేరియా,టైఫాయిడ్, ఇతర) కేసెస్ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తారు. వాతావ‌ర‌ణ మార్పుల‌కు అనుగుణంగా వ్యాప్తి చెందే సీజన‌ల్ డిసీజెస్‌కు సంబంధించి ముంద‌స్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్త‌లు, చ‌ర్యల‌కు ఆర్టీజీఎస్‌లోని సాంకేతిక స‌దుపాయాల‌ను వినియోగించుకోనున్నారు. ఆర్టీజీఎస్ సేవ‌ల‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నే దానిపై డైరెక్టర్ ఆఫ్ సెకండ‌రీ హెల్త్, డైరెక్టరేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అధికారుల‌కు అవ‌గాహ‌న కల్పించారు.

వాతావరణ మార్పులతో అప్రమత్తం

ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం ఎప్పటిక‌ప్పుడు వాతావ‌ర‌ణ మార్పుల‌ను ప‌సిగ‌ట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజ‌ల‌ను అప్రమ‌త్తం చేస్తుంటుంద‌ని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇప్పుడు మారుతున్న వాతావ‌ర‌ణాన్ని బ‌ట్టి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబ‌లుతాయో డేటా విశ్లేష‌ణ‌తో అవేర్ విభాగం ద్వారా ముంద‌స్తుగానే ప‌సిగ‌ట్టి స‌మ‌ర్థవంత‌మైన చ‌ర్యలు తీసుకోవడానికి వీలు కానుంది.

డెంగీ, మ‌లేరియా, టైఫాయిడ్‌, ఇతర కేసులను సచివాలయాలు వారిగా గుర్తిస్తామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఇందుకు ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు కూడా పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు. ఐదారు సంవత్సరాల్లో నమోదైన కేసులు వివరాలను కూడా అనుసంధానం చేస్తామన్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులపై పూర్తి అవగాహన వస్తుందని పేర్కొన్నారు.

ఇతర శాఖలతో అనుసంధానం

మాతాశిశు ఆరోగ్యం, సీజేరియ‌న్లు, టీకాలు వేయించుకునే శిశువులు త‌దిత‌ర వివరాల‌ను గ్రామ, సచివాలయాల వారీగా వివరాలు సిద్ధం చేస్తున్నారు. సైక్లోన్ సమయంలో సదరు ప్రాంతాల్లోని హైరిస్క్ గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవేర్ బాగా ఉపయోగపడుతుందని మంత్రి సత్యకుమార్ వివరించారు. ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలో నడిచే అవేర్ ప్లాట్‌ఫాం వేదికగా వ్యవసాయ, మత్స్య శాఖలు, పర్యావరణం కాలుష్యం, వాటర్ అండ్ రిజర్వాయర్ మేనేజ్‌మెంట్, శాటిలైట్ డేటా బేస్డ్ మానిటరింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర శాఖలతో అనుసంధానం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More