...
...
Next Story

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ అలర్ట్ - ఈనెల 18 వరకు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు యానాంలో అక్టోబర్ 18 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

Published on: Oct 17, 2026, 05:13:02 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ కు వాతావరణశాఖ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 18 వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది.

ఏపీకి వర్ష సూచన
ఏపీకి వర్ష సూచన

కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో అక్కడక్కడా కుండపోత వర్షాలు పడవచ్చు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ 3 రోజుల కాలంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అకస్మాత్తుగా వీచే బలమైన ఈదురుగాలుల వల్ల చేతికొచ్చిన పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని…. తీరం దాటి ముందుకు వెళ్లవద్దని వర్ష హెచ్చరికల్లో పేర్కొన్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు.

ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు…

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటనలోని వివరాల ప్రకారం….. ద్రోణి ప్రభావంతో శనివారం(అక్టోబర్ 17, 2026) ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని…. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks