ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వాన
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షాలు ప్రారంభమవగా, రానున్న కొద్ది గంటలు అత్యంత కీలకమని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో రాబోయే మూడు గంటల వ్యవధిలో ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఈ రెండు జిల్లాల పరిధిలోని ప్రజలను హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా అమలాపురం, కాట్రెనికోనతో పాటు పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆకాశం నిండా దట్టమైన మబ్బులు కమ్ముకుని, పిడుగులు పడే తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు, పశుకాపరులు తీవ్ర అప్రమత్తత పాటించాలని వెల్లడించారు. వాతావరణ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. పిడుగుల ముప్పు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసేవారు, పొలాల్లో పనిచేసేవారు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఉరుములు, మెరుపుల నేపథ్యంలో వెంటనే వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు తక్షణమే పనులను నిలిపివేసి సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలి. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, పెద్ద చెట్లు, పాత గోడలు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు, నివాసయోగ్యం కాని పాత భవనాల కింద నిలబడకూడదు.
ఉరుముల సమయాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించడం ప్రమాదకరం. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదువుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో చెట్ల కొమ్మలు, విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం పొంచి ఉంది. వాతావరణంలో సంభవిస్తున్న ఈ అకస్మాత్తు మార్పుల దృష్ట్యా మత్స్యకారులు కూడా సముద్రంలో వేటకు వెళ్లేముందు అధికారుల ముందస్తు సమాచారాన్ని పరిశీలించుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం స్థానిక మండల పరిషత్ లేదా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలని సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


