...
...
Next Story

రాబోయే 3 గంటల్లో వర్షాలు... నెల్లూరుకు ఆరెంజ్ అలెర్ట్, ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

Published on: Oct 3, 2026, 16:11:13 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు గంటల వ్యవధిలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రభావిత జిల్లాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

నెల్లూరు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్…..

నెల్లూరుకు ఆరెంజ్ అలెర్ట్
నెల్లూరుకు ఆరెంజ్ అలెర్ట్

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ముఖ్యంగా జిల్లాలోని ఆత్మకూరు, సంగం, చేజర్ల, పల్లకొండ, పొదలకూరు, నెల్లూరు నగరం, రాపూరు, కొవ్వూరు పరిసర ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.వాతావరణం ఒక్కసారిగా మారనున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్….

మరోవైపు గుంటూరు, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

వర్షం పడే సమయంలో ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం వచ్చే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ నిలబడకూడదని విజ్ఞప్తి చేసింది. సురక్షితమైన భవనాల్లో లేదా ఆశ్రయ ప్రాంతాల్లో ఉండాలని…. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని స్థానిక యంత్రాంగం సూచించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks