మహారాష్ట్ర నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడుపై ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అంతేకాకుండా.... ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఓవైపు ఎండలు మండుతుండగా… మరోవైపు తాజా వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.
ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల వర్షాలు పడొచ్చు. కొన్నిచోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇవాళ, రేపు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు.
తెలంగాణలో వర్షాలు - ఈ జిల్లాలకు హెచ్చరికలు:
తెలంగాణలో కూడా వాతావరణం భిన్నంగా ఉంది. ఓవైపు ఎండలు ఉండగా… మరికొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి.మరో మూడు నాలుగు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. ఇవాళ వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి,మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- రేపు(ఏప్రిల్ 24) సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్ాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
- ఏప్రిల్ 25వ తేదీన సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
- ఏప్రిల్ 26వ తేదీన వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఏప్రిల్ 27వ తేదీ నుంచి తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది.
అకాల వర్షాల నేపథ్యంలో…. రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం కోత దశలో ఉన్న వరి, మిర్చి, ఇతర వాణిజ్య పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని లేదా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని కోరింది.
{{/usCountry}}అకాల వర్షాల నేపథ్యంలో…. రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం కోత దశలో ఉన్న వరి, మిర్చి, ఇతర వాణిజ్య పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని లేదా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని కోరింది.
{{/usCountry}}