Telangana : వ్యవసాయ యంత్రాల సబ్సిడీ నిధులు - ఇక నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకే..!
వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. ఈ సరికొత్త విధానాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలించి…. అవసరమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

విధివిధానాలు సిద్ధం చేయండి - మంత్రి తుమ్మల
శనివారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ప్రస్తుతం వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులు కొనుగోళ్లు చేసిన పనిముట్లకు 40 శాతం సబ్సిడీ నిధులను సదరు కంపెనీలకు అందించే పద్దతి ఉందన్నారు. అలా కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి సబ్సిడీ నిధులను నేరుగా రైతుల ఖాతాలోకి బదిలీ చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అందుకు తగ్గ విధివిధానాలు తయారు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో రైతులకు సబ్సిడీపై అందించే పచ్చిరొట్ట విత్తనాలను వచ్చే ఏప్రిల్ నెలాఖరు సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇందుకు రెడ్కో సంస్థ సహకారం తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
మొదట ప్రయోగాత్మకంగా జంగారెడ్డిపల్లి మరియు జనంపేట రైతు వేదికలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. వాటి పనితీరును పరిశీలించిన తరువాత మొదటి దశలో రాష్ట్రంలోని 1600 రైతు వేదికలలో రెడ్కో ద్వారా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
రానున్న ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే తెప్పించి నిల్వ ఉంచేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలన్నారు. ఎరువుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రానికి అవసరమైన ఎరువులను ముందుగానే సమకూర్చుకోవాలని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు.
దక్షిణ పశ్చిమ రుతుపవనాలు సాధారణంగా ప్రారంభమవుతాయనే అంచనాల నేపథ్యంలో రానున్న ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం సుమారు 60.60 లక్షల హెక్టార్లలో సాగు అయ్యే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్–2026 సీజన్‌కు రాష్ట్రానికి 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

