AP Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.... మరో 4 రోజులు వర్షాలు - వాతావరణశాఖ

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులున్నాయి. ఓవైపు ఎండ హెచ్చరికలు ఉండగా… మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. ఈనెల 25 వరకు వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

Published on: Apr 20, 2026, 07:00:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Telangana Weather Updates : ఉత్తర - దక్షిణ ద్రోణి ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ కర్ణాటక, తమిళనాడు మీదుగా కొనసాగుతోంది. మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీ, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి.

ఓవైపుఎండలు...! మరోవైపు వర్షాలు (image istock)
ఓవైపుఎండలు...! మరోవైపు వర్షాలు (image istock)

ఓవైపు ఎండలు… మరోవైపు వానలు

గడిచిన రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులున్నాయి. ఓవైపు ఎండలు దంచికొడుతుండగా… మరోవైపు పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. రాబోయే మూడు నాలుగు రోజులు కూడా ఇదే మాదిరి పరిస్థితులు ఉండనున్నాయి.

ఏపీలో ఇవాళ(మార్చి 20) ఎండ తీవ్రత,మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పల్నాడు,ప్రకాశం,మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని హెచ్చరించింది.

అలాగే 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 17 మండలాల్లో వడగాల్పులు వీచేందుకు అవకాశం ఉంది. ఆదివారం కర్నూలు జిల్లాలోని నగరడోనలో 45.4 డిగ్రీలు, కడప జిల్లాలోని ఖాజీపేటలో 44.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చు. ఇక దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. కొన్నిచోట్ల ఉరుములుతో కూడిన వానలు పడొచ్చు.

తెలంగాణలోనూ వర్షాలు…

తెలంగాణ ప్రజలకు అటు ఎండల తీవ్రత, ఇటు అకాల వర్షాల ముప్పు పొంచి ఉంది. రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కూడా పడవచ్చని అంచనా వేసింది.

ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు(ఏప్రిల్ 21) నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఏప్రిల్ 25వ తేదీ వరకు తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ లో ఆదివారం పలుచోట్ల వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాచుపల్లి, అల్వాల్, సుచిత్ర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి 53 చోట్ల చెట్లు పడిపోయాయి. నగరం ఉత్తర భాగాన 4 సెంటీమీటర్ల వర్షం కురవగా 8 చోట్ల రహదారులపై వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ఫిర్యాదులను హైడ్రా సిబ్బంది క్లియర్ చేశారు. నగరవ్యాప్తంగా ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు పడిపోయినట్టు హైడ్రా కోట్రోల్ రూమ్ కి ఫిర్యాదులు రాగా రాత్రి 8.30 ప్రాంతం వరకు అన్ని క్లియర్ చేసినట్టు హైడ్రా DRF బృందాలు చెప్పాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More