...
...
Next Story

తుంగభద్ర జలాశయం కొత్త గేట్ల ప్రారంభోత్సవం.. ఒకే కారులో వచ్చిన ముగ్గురు ముఖ్యమంత్రులు

కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్ట్ కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్రమంత్రి, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ గేట్లను ప్రారంభించారు.

Published on: Jun 25, 2026, 14:00:35 IST
Advertisement

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కోట్లాది మంది రైతులకు జీవనాధారమైన తుంగభద్ర జలాశయం చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి జలాశయానికి కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లను ప్రారంభించారు.

తుంగభద్ర గేట్లు ప్రారంభం
తుంగభద్ర గేట్లు ప్రారంభం

హెలికాప్టర్‌లో కొప్పల్‌లోని ఐఆర్‌బీ హెలిప్యాడ్‌కు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరుకున్నారు. ఆ తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్‌తోపాటుగా ముగ్గురు ముఖ్యమంత్రులు తుంగభద్ర డ్యామ్ వద్దకు ఒకే కారులో కలిసి వచ్చారు. తుంగభద్ర డ్యామ్ క్రెస్ట్ గేటు వద్దకు చేరుకున్న ప్రముఖులకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అక్కడి నుండి గేట్ల ప్రారంభోత్సవ స్థలానికి వెళ్ళడానికి ఒక ప్రత్యేక బ్యాటరీతో నడిచే ఓపెన్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ఈ బ్యాటరీ వాహనంలో కూర్చుని సంయుక్తంగా గేట్ ప్రారంభోత్సవ స్థలానికి ప్రయాణించారు.

ఆటోమేటిక్ బటన్‌ను నొక్కడం ద్వారా జలాశయం 17, 18, 19, 20వ గేట్లను అధికారికంగా ప్రారంభించారు. నలుగురు ప్రముఖ నాయకులు ఒక్కో ద్వారాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమం ముగియగానే.. తుంగభద్ర డ్యామ్ గేటు ముందుకి విచ్చేసిన కర్ణాటక సీఎం డీ.కే.శివకుమార్, జలాశయంలో నీటికి చేతులు జోడించి ప్రార్థించారు.

ఈ సందర్భంగా సీఎం డీ.కే. శివకుమార్ శ్రీ గంగాధర స్వామి విగ్రహ చిత్రపటానికి నమస్కరించారు. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు గేట్ల పనితీరును నిశితంగా పరిశీలించారు. అనంతరం డ్యామ్‌కు చెందిన ఉన్నతాధికారుల బృందం గేట్ల సాంకేతిక పనితీరు, నీటి సరఫరా నిర్వహణపై ప్రముఖులకు సమగ్రంగా వివరించింది.

2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. ఆ తర్వాత నిపుణుల కమిటీ ప్రాజెక్టును పరిశీలించింది. అనంతరం రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe