SSC CGL Recruitment : రూ. 1.9లక్షల వరకు జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు- అప్లికేషన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్..

SSC CGL Recruitment 2026 apply online : ఎస్​ఎస్సీ సీజీఎల్​ రిక్రూట్​మెంట్​ 2026 గురించి బిగ్​ అప్డేట్! 12వేలకుపైగా పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇంకొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్​మెంట్​ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Jun 22, 2026, 10:43:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేంద్ర ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన కొలువు సాధించాలనుకునే నిరుద్యోగులకు ముఖ్యమైన గమనిక! ఎస్​ఎస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) సీజీఎల్ (కంపైన్డ్ గ్రాడ్యుయేట లెవల్) 2026కి సంబంధించిన రిక్రూట్​మెంట్​ ప్రక్రియ ఇంకొన్ని గంటల్లో ముగియనుంది. ఆసక్తిగల అభ్యర్థులు నేటి రాత్రి 11 గంటలలోపు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎస్​ఎస్సీ సీజీఎల్​ రిక్రూట్​మెంట్​ అప్డేట్స్..
ఎస్​ఎస్సీ సీజీఎల్​ రిక్రూట్​మెంట్​ అప్డేట్స్..

ఈ దఫా ఎస్​ఎస్సీ సీజీఎల్ రిక్రూట్​మెంట్​లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు, రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న సుమారు 12,256 గ్రూప్-బీ, గ్రూప్-సీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఆకర్షణీయమైన జీతాలు, ఉద్యోగ భద్రత, వేగవంతమైన ప్రమోషన్లు, పెన్షన్ ప్రయోజనాలతో పాటు దేశవ్యాప్తంగా పనిచేసే అవకాశం ఉండటంతో భారతదేశంలోనే అత్యంత పోటీతో కూడిన ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ఎస్‌ఎస్సీ సీజీఎల్ ఒకటిగా నిలిచింది.

ఎస్​ఎస్సీ సీజీఎల్ రిక్రూట్​మెంట్​ 2026- ముఖ్యమైన తేదీలు..

నోటిఫికేషన్ విడుదల: 21 మే 2026

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 21 మే 2026

దరఖాస్తుకు చివరి తేదీ: 22 జూన్ 2026

ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ: 23 జూన్ 2026

అప్లికేషన్ కరెక్షన్ విండో: 29 జూన్ నుంచి 1 జూలై 2026

టైర్-I పరీక్ష : ఆగస్ట్–సెప్టెంబర్ 2026

టైర్-II పరీక్ష : డిసెంబర్ 2026

ఎస్​ఎస్సీ సీజీఎల్ రిక్రూట్​మెంట్​ 2026- ఖాళీల వివరాలు..

ఈసారి ఏకంగా 12,256 ఖాళీలను ప్రకటించడంతో ఇటీవలి కాలంలోనే ఇది అతిపెద్ద ఎస్‌ఎస్సీ సీజీఎల్ రిక్రూట్‌మెంట్‌లలో ఒకటిగా నిలిచింది. భర్తీ చేయనున్న ముఖ్యమైన పోస్టులు ఇవే:

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్​ఓ)

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్

ఇన్‌కమ్ టాక్స్ ఇన్‌స్పెక్టర్ / సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్

ప్రివెంటివ్ ఆఫీసర్ / ఎగ్జామినర్

అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్

సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఐ / ఎన్​ఐఏ)

ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్ / జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (జేఎస్​ఓ)

ఆడిటర్, అకౌంటెంట్, టాక్స్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్

ఎస్​ఎస్సీ సీజీఎల్ రిక్రూట్​మెంట్​ 2026- వేతన వివరాలు..

ఎస్‌ఎస్సీ సీజీఎల్ ఉద్యోగాలకు అభ్యర్థులు అంతగా పోటీ పడటానికి ప్రధాన కారణం అందులో లభించే భారీ శాలరీ ప్యాకేజీ.

పే లెవెల్ 8: రూ. 47,600 – రూ. 1,51,100

పే లెవెల్ 7: రూ. 44,900 – రూ. 1,42,400

పే లెవెల్ 6: రూ. 35,400 – రూ. 1,12,400

పే లెవెల్ 5: రూ. 29,200 – రూ. 1,92,300

పే లెవెల్ 4: రూ. 25,500 – రూ. 81,100

బేసిక్ శాలరీతో పాటు ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), ఇంటి అద్దె భత్యం (హెచ్​ఆర్​ఏ), రవాణా భత్యం (టీఏ), వైద్య సదుపాయాలు, లీవ్ ట్రావెల్ కన్సెషన్, పెన్షన్ వంటి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి.

ఎస్​ఎస్సీ సీజీఎల్ రిక్రూట్​మెంట్​ 2026- అర్హత ప్రమాణాలు..

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఎస్​ఎస్సీ సీజీఎల్ రిక్రూట్​మెంట్​ 2026కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కొన్ని ప్రత్యేక పోస్టులకు అదనపు అర్హతలు అవసరం.

జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (జేఎస్​ఓ): ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌లో 60% మార్కులు ఉండాలి లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II: డిగ్రీలో స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చదివిన వారు అర్హులు.

అసిస్టెంట్ ఆడిట్/అకౌంట్స్ ఆఫీసర్: ఏదైనా డిగ్రీతో పాటు సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంబీఏ ఫైనాన్స్ లేదా ఎమ్‌కామ్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఎస్​ఎస్సీ సీజీఎల్ రిక్రూట్​మెంట్​ 2026- వయోపరిమితి..

అభ్యర్థుల వయస్సును 1 ఆగస్టు 2026 నాటికి లెక్కిస్తారు. జనరల్ పోస్టులకు 18-27 ఏళ్లు, కొన్ని గ్రూప్-బీ పోస్టులకు 18-30 ఏళ్లు, ఏఎస్ఓ- సీబీఐ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 20-30 ఏళ్లు, జేఎస్‌ఓ పోస్టులకు 18-32 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎస్​ఎస్సీ సీజీఎల్ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు రుసుము..

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.

ఎస్​ఎస్సీ సీజీఎల్ రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక విధానం..

ఎస్​ఎస్సీ సీజీఎల్ రిక్రూట్​మెంట్​ 2026 ఎంపిక ప్రక్రియ రెండు అంచెల రాత పరీక్షల ఆధారంగా జరుగుతుంది.

టైర్-I పరీక్ష: ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

టైర్-II పరీక్ష: ఇందులో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటాయి. జేఎస్‌ఓ, ఆడిట్ ఆఫీసర్ పోస్టులకు అదనపు పేపర్లు ఉంటాయి.

ఎస్​ఎస్సీ సీజీఎల్ రిక్రూట్​మెంట్​ 2026- ఇలా అప్లై చేసుకోండి..

  • మొదటగా ఎస్‌ఎస్సీ అధికారిక పోర్టల్‌లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) పూర్తి చేయాలి.
  • అనంతరం మీ వ్యక్తిగత, విద్యా అర్హతల వివరాలను నమోదు చేయాలి.
  • మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
  • మీకు నచ్చిన పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలి.
  • మీ పోస్ట్ ప్రిఫరెన్స్‌లను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి.
  • అర్హతను బట్టి అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సబ్‌మిట్ చేసి ప్రింటవుట్ తీసుకోవాలి.

మరిన్ని వివరాల కోసం ఎస్​ఎస్సీ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.

ఎస్​ఎస్సీ అధికారిక వెబ్​సైట్​ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More