కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గురువారం సాయంత్రానికి బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి మిగులు నీటిని విడిచిపెడుతున్నారు. రాత్రి 9 గంటల సమయానికి బ్యారేజీకి 26,024 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, అధికారులు 20 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 14,500 క్యూసెక్కుల అదనపు నీటిని దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.

అధికారులు కేఈ ప్రధాన కాలువలోకి 5,738 క్యూసెక్కులు, కేడబ్ల్యూ ప్రధాన కాలువలోకి 5,527 క్యూసెక్కులు, గుంటూరు కాలువలోకి సుమారు 259 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ మూడు కాలువలలో కలిపి మొత్తం 11,524 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఇతర ప్రధాన జలాశయాలలకు కూడా నీరు వస్తోంది. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కేవలం ప్రకాశం బ్యారేజీ మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఎగువ నుండి వరద వస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి కూడా నీరు చేరుతోంది. ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి ఉప్పొంగడంతో ధవళేశ్వరం వద్ద గోదావరి హోరెత్తుతోంది.
ప్రకాశం బ్యారేజీ నుండి నీటి విడుదల పెరగడంతో దిగువన ఉన్న దివిసీమ మరియు కృష్ణా నది పరివాహక లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదిలోకి దిగవద్దని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కాలువలకు నీటి విడుదల పెరగడంతో ఖరీఫ్ పంటలకు ఈ నీరు ఎంతో మేలు చేస్తుందని కృష్ణా డెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగు ఉగ్రరూపం దాల్చుతోంది. కృష్ణా జిల్లాలోని నందివాడ మండల పరిధిలో బుడమేరు ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వాగు ఉద్ధృతికి వందలాది ఎకరాల్లోని పంట పొలాలు నీట మునిగి తీవ్ర పంట నష్టం వాటిల్లింది.
{{/usCountry}}ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగు ఉగ్రరూపం దాల్చుతోంది. కృష్ణా జిల్లాలోని నందివాడ మండల పరిధిలో బుడమేరు ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వాగు ఉద్ధృతికి వందలాది ఎకరాల్లోని పంట పొలాలు నీట మునిగి తీవ్ర పంట నష్టం వాటిల్లింది.
{{/usCountry}}ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీటితో పాటు కొట్టుకువచ్చిన గుర్రపుడెక్క పుట్టగుంట వంతెన వద్ద పేరుకుపోవడంతో ప్రవాహానికి తీవ్ర అడ్డంకిగా మారింది. నీరు ముందుకు సాగక ప్రవాహ తీవ్రత మరింత పెరుగుతోంది. రంగంలోకి దిగిన నీటిపారుదల శాఖ అధికారులు ప్రొక్లైనర్ యంత్రాల సహాయంతో వంతెన వద్ద చేరుకున్న గుర్రపుడెక్కను హుటాహుటిన తొలగిస్తున్నారు.
వరద మట్టం ఇదే రీతిలో కొనసాగితే గుడివాడ - హనుమాన్ జంక్షన్ మధ్య వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు, పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మరోవైపు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. జిల్లాలో మొత్తం 217.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటున 7.7 సెంటీమీటర్లుగా రికార్డైంది. ఏలూరు పరిధిలోని ఐదు మండలాల్లో ఏకంగా 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధికంగా చింతలపూడి మండలంలో 16.2 సెంటీమీటర్లు, అత్యల్పంగా జంగారెడ్డిగూడెంలో 4.3 సెంటీమీటర్ల నమోదైంది.