ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రైలు నెం.06571 యశ్వంత్‌పూర్-కతిహార్ స్పెషల్ మార్చి 10, 17, 24, 31 (మంగళవారాలు) తేదీల్లో ఉదయం 7 గంటలకు యశ్వంత్‌పూర్ నుండి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 5 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. ఉదయం 5.10 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 4.30 గంటలకు కతిహార్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో, రైలు నెం. 06572 కతిహార్-యశ్వంత్‌పూర్ స్పెషల్ మార్చి 13, 20, 27, ఏప్రిల్ 3 (శుక్రవారాలు) తేదీలలో ఉదయం 5.15 గంటలకు కతిహార్ నుండి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు తెల్లవారుజామున 3.40 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. తెల్లవారుజామున 3.50 గంటలకు బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.
ఈ ట్రైన్లు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్, నంద్యాల, మార్కాపూర్‌రోడ్డు, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, భువనేశ్వర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఏసీ త్రీటైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
మరికొన్ని ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రకారం తిరువనంతపురం - సంత్రాగచ్చి(ట్రైన్ నెంబర్ 06081) మధ్య మార్చి 13, 20 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్ 14:15 గంటలకు బయల్దేరి.. రెండో రోజు మధ్యాహ్నం 14:15 గంటలకు సంత్రాగచ్చి స్టేషన్ కు చేరుకుంటుంది. ఇక సంత్రాగచ్చి - తిరువనంతపురం(06082) మధ్య కూడా ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ మార్చి 10,17 తేదీల్లో ఉంటాయి. ఈ ట్రైన్స్ మధ్యాహ్నం 14:20 నిమిషాలకు బయల్దేరి... రెండో రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరువనంతపురం చేరుకుంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు... కొల్లాం, కాయంకులం, మావేలికర, చెంగన్నూర్, తిరువల్ల, చంగనాశేరి, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, అలువా, త్రిస్సూర్, పాలక్కాడ్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పెట్టై, కట్పాడి, తిరుత్తని, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్పూర్ స్టేషన్లలో ఆగుతాయి.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లు... కొల్లాం, కాయంకులం, మావేలికర, చెంగన్నూర్, తిరువల్ల, చంగనాశేరి, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, అలువా, త్రిస్సూర్, పాలక్కాడ్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పెట్టై, కట్పాడి, తిరుత్తని, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్పూర్ స్టేషన్లలో ఆగుతాయి.
{{/usCountry}}ఇక పోదనూర్ – బరౌనీ(ట్రైన్ నెంబర్ 06021) మధ్య మార్చి 16,23 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ తెల్లవారుజామున 04:30 గంటలకు బయల్దేరి... మరునాడు మధ్యాహ్నం 2 గంటలకు బరౌనీ చేరుకుంటాయి. బరౌనీ – పోదనూర్(06022) మధ్య మార్చి 19,26 తేదీల్లో ట్రైన్స్ ఉంటాయి. బరౌనీ నుంచి మధ్యాహ్నం 1.15 గంటలకు ట్రైన్ బయల్దేరి... రెండో రోజు రాత్రి 11.30 నిమిషాలకు పోదనూర్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పెట్టై, కట్పాడి, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చిరాలా, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, సిర్పూర్ కాఘజ్‌నగర్, బల్హార్షా, చందర్పూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సి, జబల్‌పూర్, సత్నా, మణిక్పూర్, ప్రయాగ్‌రాజ్ చెహోకి, చునార్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, బక్సర్, ఆరా, దానాపూర్, పాటలిపుత్ర, హాజీపూర్, షాహ్‌పూర్ పట్టోరీ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.