ఆంధ్రప్రదేశ్ మీదుగా కతిహార్-యశ్వంత్‌పూర్ స్పెషల్ వీక్లీ ట్రైన్స్.. ఈ తేదీల్లో

Special Train : ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా వెళ్తాయి.

Published on: Mar 11, 2026 6:08 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రైలు నెం.06571 యశ్వంత్‌పూర్-కతిహార్ స్పెషల్ మార్చి 10, 17, 24, 31 (మంగళవారాలు) తేదీల్లో ఉదయం 7 గంటలకు యశ్వంత్‌పూర్ నుండి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 5 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. ఉదయం 5.10 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 4.30 గంటలకు కతిహార్ చేరుకుంటుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తిరుగు ప్రయాణంలో, రైలు నెం. 06572 కతిహార్-యశ్వంత్‌పూర్ స్పెషల్ మార్చి 13, 20, 27, ఏప్రిల్ 3 (శుక్రవారాలు) తేదీలలో ఉదయం 5.15 గంటలకు కతిహార్ నుండి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు తెల్లవారుజామున 3.40 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. తెల్లవారుజామున 3.50 గంటలకు బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.

ఈ ట్రైన్లు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుత్తి, డోన్‌, నంద్యాల, మార్కాపూర్‌రోడ్డు, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, భువనేశ్వర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఏసీ త్రీటైర్‌, స్లీపర్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

మరికొన్ని ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే ప్రకారం తిరువనంతపురం - సంత్రాగచ్చి(ట్రైన్ నెంబర్ 06081) మధ్య మార్చి 13, 20 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్ 14:15 గంటలకు బయల్దేరి.. రెండో రోజు మధ్యాహ్నం 14:15 గంటలకు సంత్రాగచ్చి స్టేషన్ కు చేరుకుంటుంది. ఇక సంత్రాగచ్చి - తిరువనంతపురం(06082) మధ్య కూడా ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ మార్చి 10,17 తేదీల్లో ఉంటాయి. ఈ ట్రైన్స్ మధ్యాహ్నం 14:20 నిమిషాలకు బయల్దేరి... రెండో రోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరువనంతపురం చేరుకుంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు... కొల్లాం, కాయంకులం, మావేలికర, చెంగన్నూర్, తిరువల్ల, చంగనాశేరి, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, అలువా, త్రిస్సూర్, పాలక్కాడ్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పెట్టై, కట్పాడి, తిరుత్తని, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయి.

ఇక పోదనూర్ – బరౌనీ(ట్రైన్ నెంబర్ 06021) మధ్య మార్చి 16,23 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ తెల్లవారుజామున 04:30 గంటలకు బయల్దేరి... మరునాడు మధ్యాహ్నం 2 గంటలకు బరౌనీ చేరుకుంటాయి. బరౌనీ – పోదనూర్(06022) మధ్య మార్చి 19,26 తేదీల్లో ట్రైన్స్ ఉంటాయి. బరౌనీ నుంచి మధ్యాహ్నం 1.15 గంటలకు ట్రైన్ బయల్దేరి... రెండో రోజు రాత్రి 11.30 నిమిషాలకు పోదనూర్ చేరుకుంటుంది.

ప్రత్యేక రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పెట్టై, కట్పాడి, పెరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చిరాలా, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, రామగుండం, సిర్పూర్ కాఘజ్‌నగర్, బల్హార్షా, చందర్పూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సి, జబల్‌పూర్, సత్నా, మణిక్పూర్, ప్రయాగ్‌రాజ్ చెహోకి, చునార్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, బక్సర్, ఆరా, దానాపూర్, పాటలిపుత్ర, హాజీపూర్, షాహ్‌పూర్ పట్టోరీ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More