...
...
Next Story

South Coast Railway Zone : దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోనే పలాస- ఇచ్చాపురం సెక్షన్‌..! రైల్వేశాఖ క్లారిటీ

దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్టేషన్ల వివాదంపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొత్తగా ఏర్పాటు చేశామని…. దీని ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంటుందని తెలిపింది. పలాస-ఇచ్చాపురం సెక్షన్ కూడా ఈ కొత్త జోన్ లోనే ఉంటుందని స్పష్టం చేసింది.

Published on: Apr 6, 2026, 07:14:09 IST
Advertisement

దక్షిణ కోస్తా రైల్వే జోన్ సరిహద్దులు, స్టేషన్ల విషయంపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తూర్పు కోస్తా రైల్వే జోన్ లో పలు స్టేషన్లు కలపడం, విడదీయడం వంటి నిర్ణయాలతో ఆదాయంపైనా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

విశాఖపట్నం
విశాఖపట్నం

విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే (ఎస్సీఓఆర్) జోన్ ప్రధాన కార్యాలయం ఉంటుందని భారతీయ రైల్వే ఆదివారం ప్రకటించింది. సుమారు 50 కిలోమీటర్ల పొడవైన పలాస-ఇచ్చాపురం సెక్షన్ లో ఏడు స్టేషన్లు(పలాస, సుమ్మదేవి, మందాస రోడ్, బరువా, సోంపేట, ఝాడుపూడి,ఇచ్చాపురం.) ఉన్నాయని పేర్కొంది. ఇవన్నీ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయని తెలిపింది.ఈ స్టేషన్లలో ఏదీ కూడా ఒడిశా పరిధిలో లేదని పేర్కొంది.

"ఈ స్టేషన్లు ప్రధానంగా ప్రయాణీకుల రద్దీని నిర్వహించే చిన్న నుంచి మధ్య తరహా స్టేషన్లు. వీటిలో ఏదీ ప్రధాన సరుకు రవాణా స్థానం కాదు. అందువల్ల ఈసీఓఆర్ ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడదు' అని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఏ జోన్ కు అధికార పరిధి ఉందనే దానితో సంబంధం లేకుండా సరుకు రవాణా నిరంతరాయంగా కొనసాగుతుందని రైల్వేశాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలు జోనల్ సరిహద్దుల వెంబడి నిరంతరాయంగా ఉండేలా చూస్తాయని వివరించింది.

'రైళ్ల సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. పలాసా-భువనేశ్వర్, పలాసా-కటక్, ఇచ్చాపురం-కటక్ మెమూ / ప్యాసింజర్ సర్వీసులతో సహా ప్రస్తుతం ఉన్న అన్ని రైళ్లు షెడ్యూల్, మార్గం లేదా ఫ్రీక్వెన్సీలో ఎటువంటి మార్పు లేకుండా నడుస్తాయి" అని రైల్వేశాఖ తెలిపింది.

ఒడిశా పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధత అచంచలమైనదని రైల్వేశాఖ తెలిపింది. ఒడిశాలో రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, స్టేషన్ల ఆధునీకరణ, వందే భారత్ సేవలు, తూర్పు కోస్తా రైల్వే జోన్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన రాయగడ డివిజన్‌పై రికార్డు స్థాయిలో మూలధన వ్యయం చేయడం ఈ నిబద్ధతకు నిదర్శనమని గుర్తు చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe